
హైదరాబాద్ సిటీలో కురిసిన భారీ వర్షానికి అమీర్ పేట్ ప్రాంతంలో మళ్లీ భయంకర దృశ్యాలు కనిపించాయి. అమీర్ పేట మెట్రో స్టేషన్ పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. అమీర్ పేట్ మెట్రో స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడింది. సేఫ్ జోన్లో ఉండాలంటే కొన్ని గంటల పాటు అమీర్ పేట్ వైపు వెళ్లకపోవడమే బెటర్. అమీర్ పేట్ ఏరియా అంతలా వరద నీటితో నిండిపోయింది. భారీ వర్షాలతో సిటీ బస్సులు ఎక్కే గురువారం రాత్రి కురిసిన వర్షానికి జూబ్లీహిల్స్, కృష్ణానగర్, యూసుఫ్ గూడ, ఎల్లారెడ్డి గూడ ప్రాంతాలతో పాటు మధురానగర్, శ్రీనివాస్ నగర్ వెస్ట్ నుంచి భారీగా వరద రావడంతో రోడ్డుపై నీళ్లు నిలిచిపోయాయి.
#HyderabadRains
— Addicted To Memes (@Addictedtomemez) August 7, 2025
Situation in Hyderabad Right Now pic.twitter.com/DbnHBoc9JT
హైదరాబాద్‌లో భారీగా వర్షపాతం నమోదైంది. ఖాజాగూడలో 12 సెంటీ మీటర్లు, ఎస్సార్ నగర్‌లో 11, ఖైరతాబాద్‌లో 11, సరూర్‌నగర్‌లో 10 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. నగరంలో గంటన్నర పాటు వర్షం దంచికొట్టింది. దాదాపు గంటన్నర పాటు కుండపోతగా కురిసిన వర్షానికి రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కావడం గమనార్హం. ఎక్కడికక్కడ మ్యాన్ హోల్స్ పొంగిపొర్లుతున్నాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించింది. దాదాపు రాత్రి పది గంటల వరకు నగరానికి వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది.
హైదరాబాద్ సిటీలో నమోదైన వర్షపాతం వివరాలు:
* అత్యధికంగా శేర్లింగంపల్లి 12.3 సెంటీమీటర్ల వర్షపాతం
* జూబ్లీహిల్స్ 11.1
* ఖైరతాబాద్ 10.8
* సరూర్నగర్ 10.6
* యూసఫ్ గూడా 10. 4
* ఉప్పల్ 9.5
* ఎల్బీనగర్ 9.3
* బంజారాహిల్స్ 9
* హయత్ నగర్ 8.3
* కార్వాన్ 7.9
* మలక్ పేట్ 7.6
* బోరబండ 7.5
* రామంతపూర్ 7.5
* నాగోల్ 7.4
* ముసరాంబాగ్ 7.3
* కూకట్ పల్లి, చందానగర్ 7.2
* మూసాపేట్ 7
* షేక్ పేట్ 6.6
* మల్కాజిగిరి 6.5
* హబ్సిగూడ, నేరేడుమెట్, బాలానగర్, ఫిలింనగర్, సఫిల్ గూడ 6
* హైదరాబాద్లోని మిగతా చాలా ఏరియాల్లో నాలుగు నుంచి ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు