ఆలస్యంగా వస్తే హాఫ్‌డే: ఆఫీస్ అటెండెన్స్ రూల్స్‌పై ఉద్యోగుల చర్చ...

ఆలస్యంగా వస్తే హాఫ్‌డే: ఆఫీస్ అటెండెన్స్ రూల్స్‌పై ఉద్యోగుల చర్చ...

ఒక ఉద్యోగి కంపెనీ అటెండేన్స్ విధానాన్ని తప్పుపడుతూ Redditలో పోస్ట్ చేశాడు. కొంచెం ఆలస్యామైతే కూడా హాఫ్‌డేగా పరిగణించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. r/IndianWorkplaceలో చేసిన ఈ పోస్ట్ పెద్ద చర్చకు దారితీసింది. ఆఫీసుకు ఉదయం 9:30కి రిపోర్ట్ చేయాలనే కఠిన రూల్ ఈ ఆధునిక కాల పని సంస్కృతిలో అవసరమా అని ప్రశ్నలు తలెత్తాయి.

ఉద్యోగి షేర్ చేసిన ఒక టీమ్ మెసేజ్ ప్రకారం, ముందుగా సమాచారం లేకుండా 9:30 తర్వాత ఆఫీసుకు వస్తే హాఫ్‌డేగా పరిగణిస్తారు. దీనికి ఎలాంటి మినహాయింపులు ఉండవు. ఏదైనా సరైన కారణం వల్ల మీరు ఆఫీసుకు ఆలస్యంగా వస్తున్నట్లయితే, మీ మేనేజర్‌కి ముందుగానే చెప్పాలి. ఒకవేళ అలా చెప్పకుండా  9:30 తర్వాత వస్తే హాఫ్‌డేగా పరిగణిస్తాం అని మెసేజ్‌లో రాసి ఉంది.

ALSO READ | TCS News: శుభవార్త చెప్పిన టీసీఎస్.. ఆ ఉద్యోగులకు శాలరీ హైక్స్, సెప్టెంబర్ నుంచే..

దీని పై ఓ ఉద్యోగి మాట్లాడుతూ మనం ఇంకా స్కూల్లో ఉన్నామా ? అంటూ ప్రశ్నించాడు. ట్రాఫిక్, అత్యవసర పరిస్థితుల వల్ల ఆలస్యమైనా ఉద్యోగిని ఇలా శిక్షించడం కరెక్ట్ కాదని, ఉద్యోగులు చేసే పనికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.

ఈ పోస్టు పై చాల మంది నెటిజన్లు కామెంట్స్ చేశారు. కొందరు టైంకి ఆఫీసుకు వెళ్లడమే మంచిదని చెప్పగా, మరికొందరు మా మేనేజర్లు చాలా కూల్‌గా ఉంటారని , పని చేస్తే చాలని చెప్పారని అన్నారు. లాగిన్, లాగౌట్ టైం మార్చమని మీ కంపెనీని అడగొచ్చు. గురుగ్రామ్, నోయిడాలలో కంపెనీలు ఇలా షిఫ్ట్ టైమింగ్స్ పెట్టుకున్నాయి అని ఒక నెటిజన్ సలహా ఇచ్చాడు.

ఈ మనస్తత్వంతో మనం చైనా, అమెరికాతో ఎలా పోటీ పడతాం ? మనం ఇప్పటికీ మొబైల్ ఫోన్‌లు తయారు చేయడానికి కష్టపడుతున్నాం. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే భారతదేశం కేవలం సేవలు అందించే ఆర్థిక వ్యవస్థగా మిగిలిపోయే ప్రమాదం ఉంది అని మరొకరు అన్నారు.