తిరుపతిలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షం కురుస్తోంది. దీంతో తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే వారికి అన్ని విధాల సౌకర్యం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చర్యలు చేపట్టింది. భారీ వర్షాల కారణంగా తిరుపతి లో చిక్కుకు పోయిన భక్తులకు వసతి ఏర్పాటు చేసింది. వసతి కోసం ఇబ్బందులు పడుతున్న భక్తులు తిరుపతి లోని శ్రీనివాసం, మాధవం, రెండు, మూడో సత్రాల్లో వసతి ఏర్పాటు చేశారు.
మరోవైపు .. వర్షం కారణంగా శ్రీవారి దర్శనానికి రాలేని భక్తులుకు ఉపశమనం కలిగించింది TTD. ఇవాళ,రేపు,ఎల్లుండి దర్శన టిక్కెట్లు కలిగి రాలేని భక్తులు..తర్వాత రోజులలో శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని ఈఓ జవహర్ రెడ్డి తెలిపారు.
