పుతిన్ కు స్పెషల్ బాడీగార్డు.. అతడి పనేంటో తెలుసా..? 

పుతిన్ కు స్పెషల్ బాడీగార్డు.. అతడి పనేంటో తెలుసా..? 

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ప్రత్యేకంగా ఒక బాడీగార్డు ఉన్నాడు. పుతిన్ ఎక్కడకు వెళ్లినా..ఆ బాడీగార్డు ఆయనతోనే ఉంటారు. మరీ ఆ బాడీగార్డు చేసే పని ఎంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

రష్యా ప్రెసిడెండ్‌ వ్లాదిమిర్‌ పుతిన్‌ ఓ స్పెషల్‌ పర్సన్‌. అతడు ఏం చేసినా అంతర్జాతీయ మీడియా ప్రపంచానికి చూపిస్తుంటుంది. ఉక్రెయిన్‌లో రష్యా దాడులు ప్రారంభమైనప్పటి నుంచి ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ పేరు వింటనే కొన్ని దేశాలు భయపడిపోతున్నాయి. తాజాగా పుతిన్‌ గురించి ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది. పుతిన్‌ కు ప్ర‌త్యేక‌మైన ఒక బాడీగార్డ్ ఉన్నాడనే విషయం బయటికొచ్చింది. పుతిన్ ఎక్క‌డికి వెళ్లినా ఆ బాడీగార్డ్ కూడా ఆయ‌నతోనే ఉంటారట. 

పుతిన్ మ‌ల‌ మూత్రాల‌ను ఆ బాడీగార్డ్ సేక‌రిస్తుంటాడ‌ని తాజాగా ఓ రిపోర్ట్‌లో వెల్లడైంది. ఫాక్స్ న్యూస్ దీనిపై ఓ క‌థ‌నాన్ని రాసింది. పుతిన్ ఆరోగ్య ర‌హ‌స్యాలు తెలియ‌కుండా ఉండేందుకు.. బాడీగార్డు ఇలా ఆయన మలమూత్రాలను సేకరిస్తుంటాడని సదరు వార్తా సంస్థ తాజా కథనంలో పేర్కొంది. విదేశీ ఇంటెలిజెన్స్‌కు ఆరోగ్య ర‌హ‌స్యాలు బహిర్గతం కాకుండా పుతిన్ ఇలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్లు డీఐఏ ఇంటెలిజెన్స్ ఆఫీస‌ర్ రెబెకా కోఫ్ల‌ర్ చెప్పారు. ర‌ష్యాకు చెందిన ఫెడ‌ర‌ల్ గార్డ్ స‌ర్వీస్ ప్ర‌త్యేక సూట్‌కేసును తీసుకువెళ్తుంద‌ని, ఆ సూట్‌కేస్‌లో పుతిన్ మ‌ల‌మూత్రాల‌ను తిరిగి మాస్కోకు పంపిస్తార‌ని ఫ్రెంచ్ ప‌త్రిక కూడా పేర్కొంది. 

ఉక్రెయిన్‌పై దాడి ప్రారంభించినప్పటి నుంచి పుతిన్ ఆరోగ్యం బాగా క్షీణించిన‌ట్లు ఇటీవ‌ల పుకార్లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఆరోగ్య బ‌ల‌హీన‌త‌లు బ‌య‌ట‌ప‌డ‌కుండా ఉండేందుకు పుతిన్ మ‌ల‌మూత్రాల‌ను బాడీగార్డ్ సేక‌రిస్తుంటాడ‌ని ఫ్రెంచ్ మ్యాగ్జిన్ పారిస్ మాక్ తెలిపింది.

మరోవైపు.. ఉక్రెయిన్‌లో రష్యా దాడులు ప్రారంభించిన నాటి నుంచి పుతిన్‌ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే పుతిన్‌కు కళ్లకు సంబంధించిన వ్యాధి ఉందని, మరో మూడేళ్లలో కంటి చూపు మందగించే అవకాశం ఉందనే వార్తలు చక‍్కర్లు కొట్టాయి. అంతేకాదు.. పుతిన్‌కు బ్ల‌డ్ క్యాన్స‌ర్ ఉన్న‌ట్లు ఇటీవ‌ల‌ వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఆ వార్తలను ర‌ష్యా అధికారులు కొట్టిపారేస్తున్నారు.