రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు

రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నాయి. ఇవాళ, రేపు అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సూర్యాపేట జిల్లా ఆత్మకూరులో 18.9 సెంటీమీటర్లు అతి భారీ వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా నాగులవంచలో 14.8 సెంటీమీటర్లు, ఖమ్మంలోని ఖానాపూర్లో 14.4 సెంటీమీటర్లు, సూర్యాపేటలోని తుంగతుర్తిలో 13.4 సెంటీమీటర్లు, ఖమ్మం జిల్లాలోని కూమవల్లిలో 12.2 సెంటీమీటర్లు, ఖమ్మం లోని రావినూతల, వైరాలో 11.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

ఖమ్మం జిల్లాలోని ప్రకాష్ నగర్ లో 11.4 సెంటీమీటర్ల భారీ వర్షం నమోదవగా.. సూర్యాపేటలోని మామిల్లగూడెంలో 10.9 సెంటీమీటర్లు ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో 10.8 సెంటీమీటర్లు, గుబ్బగుర్తిలో 10.7 సెంటీమీటర్లు, సూర్యాపేటలోని కనిగిరిలో 10.7 సెంటీమీటర్లు, నడిగూడెంలో 10.6, రెడ్డిగూడలో 10.3, ఖమ్మంలోని నేలకొండపల్లిలో 10.2 సెంటీమీటర్లు, కొత్తగూడెంలోని సీతారాం పట్టణంలో 10.1 సెంటీమీటర్ల అతి భారీ వర్షపాతం రికార్డైంది. హైదరాబాద్ సిటీలోనూ ఉదయం నుంచి తేలికపాటి జల్లులు పడుతున్నాయి. గోషామహల్ లో 2.9 సెంటీమీర్లు మోస్తారు వర్షం కురవగా, చార్మినార్, కార్వాన్, మలక్ పేట్, రాజేంద్రనగర్, ఫలక్ నుమా, సంతోష్ నగర్, రాజేంద్రనగర్, మెహిదీపట్నం, హయత్ నగర్, ఎల్బీనగర్ సహా పలు ప్రాంతాల్లో జల్లు పడుతున్నాయి. 

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, ఆదిలాబాద్, కొమరం భీమ్, నిర్మల్, జగిత్యాల్, యాదాద్రి, జనగాం, నాగర్ కర్నూల్, నిజామాబాద్, కొత్తగూడెం, సూర్యాపేట, సిద్దిపేట, వరంగల్ అర్బన్ రూరల్, ములుగు, మహబూబాబాద్ కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.