పెళ్లి పేరుతో యువతిని మోసగించిన నిందితుడి అరెస్ట్

పెళ్లి పేరుతో యువతిని మోసగించిన నిందితుడి అరెస్ట్

హుస్నాబాద్/అక్కన్నపేట,వెలుగు: ప్రేమ పేరుతో ఓ యువతిని నమ్మించి, పెళ్లి చేసుకుంటానని శారీరకంగా లొంగదీసుకుని మోసం చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట ఎస్సై ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా పాలకుర్తి మండలానికి చెందిన ఉస్తేం ప్రవీణ్ (22), అక్కన్నపేట మండలం బొడిగెపల్లికి చెందిన ఓ యువతికి ప్రేమ పేరుతో  దగ్గరయ్యాడు.

పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రవీణ్.. పలుమార్లు శారీరకంగా లొంగదీసుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని యువతి కోరగా ముఖం చాటేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసి   బుధవారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రవీణ్‌ను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు.