
ములుగు, వెలుగు: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష, రూ.12 వేల జరిమానా విధిస్తూ గురువారం జిల్లా జడ్జి సూర్య చంద్రకళ తీర్పు చెప్పారు. కేసు వివరాలను ఎస్పీ పి.శబరీశ్ మీడియాకు వివరించారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ముళ్లకట్ట పంచాయతీ పరిధిలోని గుర్రంపేటకు చెందిన మంతెన రామయ్య 2023లో అదే గ్రామానికి చెందిన ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ ఘటనపై ఏటూరునాగారం పోలీస్స్టేషన్లో పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. నిందితుడినై నేరం రుజువు కావడంతో ఈ మేరకు తీర్పు చెప్పినట్లు ఎస్పీ తెలిపారు. బాధితురాలికి రూ.10 లక్షల నష్ట పరిహారం అందజేయాలని ఆదేశించారు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన దర్యాప్తు అధికారి సంకీర్త్తో పాటు అడిషనల్ ఎస్పీ శివం ఉపాధ్యాయను ఎస్పీ అభినందించారు.