బాలికపై అత్యాచారం, హత్య కేసులో.. నిందితుడికి జీవిత ఖైదు

బాలికపై అత్యాచారం, హత్య కేసులో.. నిందితుడికి జీవిత ఖైదు

నల్లగొండ జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. మైనర్ బాలికపై అత్యాచారం, హత్య  కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధించింది. నేరం చేసిన ఎవరూ చట్టం నుంచి తప్పించుకోలేరని మరోసారి కోర్టు రుజువు చేసింది.  వివరాల్లోకి వెళితే.. 

నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ గ్రామానికి చెందిన నిందితుడు కట్టెల సైదులు కు శుక్రవారం (సెప్టెంబర్ 26) మైనర్ బాలికపై అత్యాచారం కేసులో పోక్సోకోర్టు జీవిత ఖైదు విధించింది. 

2019లో  పదవ తరగతి చదువుతున్న అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికపై నిందితుడు కట్టెల సైదులు అత్యాచారం చేశాడు. విషయం బయటికి తెలియడంతో బాలిక ఆత్మహత్య చేసుకుంది. దీంతో నిందితుడు కట్టెల సైదులుపై చిట్యాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.

►ALSO READ | ప్రజలను అప్రమత్తం చేయండి: కలెక్టర్లకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

ఈ కేసును విచారించిన నల్లగొండ జిల్లా పోక్సో కోర్టు.. శుక్రవారం కట్టెల సైదులుపై నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు విధిస్తూ తీర్పు నిచ్చింది పోక్సో జిల్లా కోర్టు జడ్జి రోజారమణి.  నిందితుడికి 65 వేల రూపాయల జరిమానా కూడా విధించింది. నేరం చేస్తే ఎవరైన చట్టం నుంచి తప్పించుకోలేరని హెచ్చరించింది.