డిసెంబర్లో ఏరులై పారిన లిక్కర్ ..నెలలోనే రూ. 138 కోట్లు

డిసెంబర్లో ఏరులై పారిన లిక్కర్ ..నెలలోనే రూ. 138  కోట్లు

 

  • ఒక్క నెలలోనే రూ. 137.98 కోట్లు
  • గత డిసెంబర్​ కంటే.. రూ. 44.70 కోట్లు ఎక్కువ
  • చివరి నాలుగు రోజుల్లో లిక్కర్​ సేల్స్​ రూ.22.51 కోట్లు

యాదాద్రి, వెలుగు:  డిసెంబర్​లో లిక్కర్​ ఏరులై పారింది. ఎక్సైజ్​ డిపార్ట్​మెంట్​ గల్లాపెట్టె నిండిపోయింది. 2024 డిసెంబర్​ కంటే ఈసారి లిక్కర్​ సేల్స్​ విపరీతంగా పెరిగిపోయింది. న్యూ ఇయర్​ పేరుతో చివరి నాలుగు రోజుల్లో మరీ ఎక్కువగా సేల్స్​ జరిగింది.  యాదాద్రి జిల్లాలోని నాలుగు ఎక్సైజ్​ స్టేషన్ల పరిధిలో  82 వైన్స్​లు ఉన్నాయి.

 ఈ జిల్లా మీదుగా రెండు నేషనల్​  హైవేలు ఉండడంతో పాటు హైదరాబాద్​కు దగ్గరగా ఉండడం వల్ల లిక్కర్​ సేల్స్​ ఎక్కువగానే సాగుతాయి. 2023, 2024 డిసెంబర్​ కంటే ఈ డిసెంబర్​లో సేల్స్​ విపరీతంగా జరిగింది. 2023లో లిక్కర్​ కేసులు 1,13,109 అమ్ముడుపోగా బీర్ల కేసులు 1,40,132 అమ్ముడుపోయాయి. ఓరాల్​గా రూ. 111.17 కోట్ల ఇన్​కం వచ్చింది.

2024లో లిక్కర్​ కేసు​లు 94,086, బీర్ల కేసు​లు 1,23,852 అమ్ముడు పోయాయి. రూ. 93.28 కోట్ల ఇన్​కం వచ్చింది. ఈ డిసెంబర్​లో లిక్కర్​ కేసులు 1,28,116, బీర్లు 1,39,497 కేసులు అమ్ముడు పోయాయి. రూ. 137.98 కోట్ల ఇన్​కం వచ్చింది. గత ఏడాది డిసెంబర్​ కంటే రూ. 44.70 కోట్ల ఇన్​కం అదనంగా 
వచ్చింది. 

చివరి నాలుగు రోజుల్లో జోష్​

న్యూ ఇయర్​ వేడుకల్లో లిక్కర్​ పాత్ర ఎక్కువే. అందుకే ఏడాది చివర్లో పెద్ద ఎత్తున లిక్కర్​ అమ్ముడుపోయింది. 2023 డిసెంబర్​ నెలలోని చివరి మూడ్రోజుల్లో రూ. 15 కోట్ల విలువైన లిక్కర్​ అమ్ముడుపోగా 2024 డిసెంబర్​ 30 నుంచి 31 అర్ధరాత్రి 12 గంటల వరకూ జిల్లాలో లిక్కర్​ కేసులు 14,113, బీర్ల కేసులు 9702 సేల్స్​ కావడంతో రూ. 14.88 కోట్ల ఇన్​కం వచ్చింది. ఈ ఏడాది 28 నుంచి 31 వరకూ లిక్కర్​ కేసులు 19,255, బీర్ల కేసులు 22,692 అమ్ముడుపోగా రూ. 22.51 కోట్ల  ఇన్​కం వచ్చింది. 

ఎన్నికల కిక్కు.. 

2025 డిసెంబర్​లో సేల్స్​ పెరగడానికి పంచాయతీ ఎన్నికలు ఓ కారణం. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు పెద్ద ఎత్తున లిక్కర్​ పంపిణీ చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువగా పంపిణీ జరిగినట్టు తెలుస్తోంది. ఆ ఎన్నికలు జరిగిన డిసెంబర్​లో లిక్కర్​ కేసులు 1,13,109, బీర్ల కేసులు 1,40,132 అమ్ముడు పోగా, 2025 డిసెంబర్​లో లిక్కర్​ కేసులు 1,28,116 , బీర్ల కేసులు 1,39,497 అమ్ముడు పోయాయి. 2024 డిసెంబర్​లో ఏ ఎన్నికలు జరగనుందున సేల్స్​ తగ్గిపోయింది. మొత్తానికి కొత్తగా వైన్స్​ షాపులు దక్కించుకున్న వారికి ఫుల్​గా ఇన్​కం వచ్చింది.