యాదాద్రి, వెలుగు: రాష్ట్ర సచివాలయంలో నూతన సంవత్సరం సందర్భంగా గురువారం సీఎం ఎనుముల రేవంత్ రెడ్డిని ఆయన ఛాంబర్‌లో యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంత రావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావు ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు
