కోర్టు మెట్లెక్కిన క్రిప్టో కేసు నిందితులు

కోర్టు మెట్లెక్కిన క్రిప్టో కేసు నిందితులు

కరీంనగర్, వెలుగు: క్రిప్టో కరెన్సీ పేరిట రూ.వందల కోట్లు కొల్లగొట్టిన నిందితులు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు మెట్లెక్కారు. హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు కౌంటర్ దాఖలు చేసినట్లు తెలిసింది. మెటా ఫండ్ క్రిప్టో కరెన్సీ పేరిట ఉమ్మడి జిల్లాలో రూ.కోట్లు వసూలు చేసిన  కరీంనగర్‌‌‌‌కు చెందిన దాసరి రమేశ్, దాసరి రాజుపై టూటౌన్ పీఎస్‌‌‌‌లో గత జులైలో కేసు నమోదైంది. 

విచారణను వేగవంతం చేసేందుకు కేసును కొద్దిరోజుల కింద సీసీఎస్‌‌‌‌కు అప్పగించినట్లు సమాచారం అందుకున్న నిందితులు.. ఏపీకి పరారై తమ సన్నిహితుల ద్వారా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది.