
చెన్నై: తన కుటుంబంపై వస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు ప్రముఖ నటుడు నాజర్. లోక్‌సభ ఎన్నికల్లో కమల్ హాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యం పార్టీ నుంచి చెన్నై సెంట్రల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన భార్య కమీలకు ఓటెయ్యకండని ఓ ముఠా కావాలని ప్రచారం చేస్తుందని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసమే కొందరు ఈ పని చేస్తున్నారని విమర్శించారు. తన కుటుంబానికి తాను ఏం చేయలేదన్నది అవాస్తవమన్నారు. అసత్యాలను జోడించి తనపై విమర్శలు చేస్తున్నారని చెప్పారు. తనపై వస్తున్న ఆరోపణలపై వివరణ ఇవ్వడానికి ఇది కరెక్ట్ టైం కాదని..సరైన సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు చెబుతానని అన్నారు నాజర్.
నాజర్ సోదరుడు ఇటీవల నాజర్ దంపతులపై మీడియా ముందు బహిరంగ విమర్శలు చేశారు. తన కుటుంబానికే ఏం చేయలేని వారు రాజకీయాల్లోకి వచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు. దీనిపై ఇన్ని రోజులు మౌనంగా ఉన్న నాజర్ తాజాగా ఓ ప్రకటన ద్వారా తన తమ్ముడిపై విమర్శలు చేశారు.