నయీం కేసులో ఉన్న నాయకులపై చర్యలు తీసుకోవాలి: దత్తాత్రేయ

నయీం కేసులో ఉన్న నాయకులపై చర్యలు తీసుకోవాలి: దత్తాత్రేయ

భువనగిరి: నయీమ్ కేసులో బాధితులకు ఇప్పటికీ న్యాయం జరగలేదని మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నయీమ్ కేసులో సమాచార హక్కు చట్టం ద్వారా బయటికి వచ్చిన అధికార పార్టీ నాయకులు , అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కేసులో వెంటనే విచారణ జరిపించి న్యాయం చేయాలని ముఖ్యమంత్రిని కోరుతున్నట్టు తెలిపారు.

మాటల గారడి తో ముఖ్యమంత్రి పరిపాలన సాగిస్తున్నారన్న దత్తాత్రేయ.. ఎన్నికలు అయిపోయిన నాటి నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేక ప్రారంభమైందని అన్నారు.

ఎయిమ్స్ విషయంలో తాను అటల్ బిహారీ వాజ్ పైతో మాట్లాడానని,మోడీ ప్రభుత్వం వల్లే తెలంగాణ ప్రాంతానికి ఎయిమ్స్ వచ్చిందని దత్తాత్రేయ అన్నారు. త్వరలో పేదలకు మంచి వైద్యం ఆందబోతుందని తెలిపారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ను కలిసి ఎయిమ్స్ ను త్వరగా పూర్తి చేయాలని కొరతానన్నారు. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని తెలంగాణలో అమలు చేయాలని కోరుతున్నానని తెలిపారు. ఎయిమ్స్ రాక తో భువనగిరి, బీబీనగర్ పెద్ద పట్టణాలు కాబోతున్నాయని, అభివృద్ధి జరగనుందని ఆయన అన్నారు.  ఎయిమ్స్ విషయంలోబూర నర్సయ్య గౌడ్ కృషి ని అభినందిస్తున్నానని దత్తాత్రేయ తెలిపారు.భువనగిరి ని తప్పకుండా పర్యాటక కేంద్రం గా అభివృద్ది చేస్తామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు దత్తాత్రేయ.

మోడీ చేసిన వాగ్దానాలు అమలు చేస్తుంటే..  టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను మరచిపోతోందన్నారు.ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని, రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు.అక్బరుద్దీన్ ప్రసంగం పై రాష్ట్ర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని  అన్నారు. టీఆర్ఎస్ తో పార్టీతో ప్రజల్లో అసంతృప్తి ఉందని, రాబోయే రోజుల్లో రాష్ట్రం లో బీజేపీ ప్రత్యామ్నాయం కాబోతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని ఆయన అన్నారు.