రోప్ షాట్స్, సీజీ లేకుండా .. యాక్షన్ సీక్వెన్స్ చేశా : వరుణ్ తేజ్

రోప్ షాట్స్, సీజీ లేకుండా ..  యాక్షన్ సీక్వెన్స్ చేశా : వరుణ్ తేజ్

తన ప్రతి సినిమాకు ఏదో ఒక కొత్త వైవిధ్యం చూపించాలని తపించే హీరో వరుణ్ తేజ్... ‘గాండీవధారి అర్జున’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ప్రవీణ్‌‌‌‌‌‌‌‌ సత్తారు దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ మూవీ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ ఇలా ముచ్చటించాడు. 

‘‘ఓ నటుడికి సామాజిక బాధ్యత ఉన్న చిత్రాల్లో నటించే అవకాశాలు తక్కువగా వస్తుంటాయి. ఇది అలాంటి ఒక యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్. సాధారణంగా యాక్షన్ సినిమాల్లో ఫైట్స్, స్టైలిష్ ఎలిమెంట్స్‌‌‌‌‌‌‌‌పై ఫోకస్ ఎక్కువగా ఉండి, కంటెంట్‌‌‌‌‌‌‌‌ తక్కువ ఉంటుంది. కానీ ప్రవీణ్ చెప్పిన కథలోని ఇష్యూ చాలా పెద్దది. ఆ సమస్య ప్రభావం వెంటనే కనిపించదు కనుక.. మనకున్న బిజీలో ఎవరమూ పట్టించుకోము. కానీ దాని ఎఫెక్ట్ కొన్నేళ్ల తర్వాత ఉంటుంది. దీంతో కథలోని మెయిన్ పాయింట్, ఎమోషన్స్ నచ్చాయి. ఇదేమీ స్పై మూవీ కాదు.  ఫారిన్‌‌‌‌‌‌‌‌ వెళ్లిన మినిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రైవేట్ సెక్యూరిటీ ఇచ్చే బాడీగార్డ్‌‌‌‌‌‌‌‌ రోల్ చేశా. నాలుగు రోజుల్లో జరిగే కథ ఇది. 

ప్రాబ్లమ్ వచ్చినప్పుడు హీరోని పిలుస్తారు. తన పేరు అర్జున్. అందుకే కాల్ ఫర్ హెల్ప్ తరహాలో స్టోరీకి యాప్ట్ అయ్యేలా టైటిల్ పెట్టాం. బేసిగ్గా నాకు యాక్షన్ సినిమాలు చాలా ఇష్టం. ఇందులో ఎక్కువ రోప్ షాట్స్, సీజీ వర్క్ లేకుండా డిఫరెంట్ యాక్షన్ సీక్వెన్స్ చేశాం. అలాగే చక్కటి ఎమోషన్స్ ఉంటాయి. గ్లోబల్ వార్మింగ్ లాంటి పెద్ద సమస్యలను సామాన్యులకు అర్థమయ్యేలా తెరకెక్కించాం. 

ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనింగ్‌‌‌‌‌‌‌‌గా ఓ మెసేజ్ ఉన్న కథ చెప్పాం. అలాగని ఇది చూసి అందరూ మారాలని చెప్పడం లేదు. కానీ ఉన్న సమస్య ఏమిటో చూపించాం. దానివల్ల ఎవరైనా మారితే మంచిదే. కథ డిమాండ్ మేరకే లండన్‌‌‌‌‌‌‌‌లో షూట్ చేశాం. నా నెక్స్ట్ మూవీ ‘ఆపరేషన్ వాలంటైన్’ డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రిలీజ్ కానుంది. హిందీలో నేను డబ్బింగ్ చెప్పబోతున్నా. ఇక ‘మట్కా’ సినిమాలోని నా పాత్రలో నాలుగు షేడ్స్ ఉంటాయి. చాలా వేరియేషన్స్ ఉన్న సినిమా అది