కాజల్ యాక్షన్ సీక్వెన్సులు చాలా స్పెషల్

కాజల్ యాక్షన్ సీక్వెన్సులు చాలా స్పెషల్

గూఢచారి, మేజర్ చిత్రాలతో దర్శకుడిగా మెప్పించిన శశికిరణ్ తిక్క.. స్క్రీన్‌‌ ప్లే అందిస్తూ సమర్పకుడిగా వ్యవహరించిన చిత్రం ‘సత్యభామ’. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌‌గా సుమన్ చిక్కాల తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శ్రీనివాసరావు తక్కలపల్లి, బాబీ తిక్క నిర్మించారు.  శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా శశికిరణ్ తిక్క మాట్లాడుతూ ‘దర్శకుడు సుమన్ చిక్కాల, నేను, శ్రీచరణ్ పాకాల మంచి మిత్రులం.  కలిసే సినిమాలు చేస్తుంటాం. ఈ సినిమాకు కూడా అలాగే వర్క్ చేశాం.

నేను డైరెక్ట్ చేయాల్సిన సినిమాలు ఉన్నాయి. అందుకే ఈ సినిమాను డైరెక్ట్ చేయలేదు. ప్రెజెంటర్‌‌‌‌గా సినిమా మేకింగ్‌‌లో మరో కోణాన్ని చూశాను. నిర్మాత అనుభవాలు ఎలా ఉంటాయో తెలిసింది. ప్రొడక్షన్ వైపు నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. దర్శకత్వం అమ్మలాంటి పని అయితే నిర్మాతగా ఉండటం నాన్న లాంటి బాధ్యత. ఇక ఇందులో కాజల్ గారు చేసిన యాక్షన్ సీక్వెన్సులు చాలా స్పెషల్. అవి ప్రేక్షకులను అలరిస్తాయి. కొత్త కాజల్‌‌ను ఇందులో చూస్తారు.

దర్శకుడిగా సుమన్ వర్క్ ఆకట్టుకుంటుంది. నేటితరం ప్రేక్షకులకు తగ్గట్టు ఫ్రెష్ స్టోరీ టెల్లింగ్‌‌తో ఉండబోతోంది. రెగ్యులర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్‌‌లా కేవలం కేసును క్లూస్‌‌తో పట్టుకోవడం కాకుండా కథలో ఎమోషన్ బాగా వర్కవుట్ అయ్యింది. అది ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్థన్, రవి వర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.  నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్, ఏపీలో ధీరజ్ మొగిలినేని రిలీజ్ చేస్తున్నారు. ఓవర్సీస్ లో సారిగమ రిలీజ్ చేస్తోంది. ఓటీటీ సహా ఓవరాల్‌గా మా సినిమాకు ట్రేడ్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక దర్శకుడిగా నా నెక్ట్ ప్రాజెక్ట్ ను త్వరలో అనౌన్స్ చేస్తాను. ఇకపై మల్టీపుల్ జానర్ మూవీస్ చేస్తాను’ అని చెప్పాడు.