యువత మత్తు పదార్థాలకు ..బానిస కాకుండా చర్యలు తీసుకోవాలి : కలెక్టర్ ఎస్ .వెంకట్రావు

యువత మత్తు పదార్థాలకు ..బానిస కాకుండా చర్యలు తీసుకోవాలి : కలెక్టర్ ఎస్ .వెంకట్రావు

సూర్యాపేట ,వెలుగు : యువత మత్తు పదార్థాలకు , మాదకద్రవ్యాలకు బానిస కాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్ వెంకట్రావు తెలిపారు . బుధవారం కలెక్టరేట్​లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో ఎస్పీ రాహుల్ హెగ్డే తో కలిసి నార్కోటిక్ కంట్రోల్​ కో-ఆర్డినేషన్ కమిటీ జాయింట్ యాక్షన్ ప్లాన్ పై సమావేశం నిర్వహించారు. యువత చెడు మార్గాల్లో వెళ్లకుండా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

 డ్రగ్స్ నివారణకు జిల్లా స్థాయి, డివిజన్, మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా తరలిరాకుండా జిల్లా సరిహద్దులలో నిఘా ఏర్పాటు చేయాలని , మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకోవాలని పోలీసు ఎక్సైజ్ అటవీశాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి అరికట్టాలన్నారు. జిల్లా కు సరిహద్దు లో, ఆంధ్రా ప్రాంతం నుంచి ఎక్కువగా సరఫరా అవుతున్న సమాచారం ఉందని.. 

సమన్వయంతో పని చేసి డ్రగ్స్  రహిత సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని అన్నారు. సమావేశంలో లో ఎక్సైజ్ సూపరింటెండెంట్​ అనిత, డీఎస్పీ రాములు, డీఎంహెచ్​ఓ కోటాచలం, డీపీఓ యాదయ్య, జిల్లా వ్యవసాయ అధికారి రామారావు నాయక్ ,డ్రగ్ ఇన్​స్పెక్టర్​ మధుసూదన్, ఆర్డీఓలు జగదీశ్​ రెడ్డి, సూర్యనారాయణ, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

డ్రగ్స్​కు దూరంగా ఉండాలి

హుజూర్ నగర్ , వెలుగు : యువత మత్తు పదార్థాలకు మాదకద్రవ్యాలకు దూరంగా  ఉండాలని కోదాడ డీఎస్పీ ప్రకాశ్​ అన్నారు . బుధవారం హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పలువురికి కౌన్సెలింగ్ నిర్వహించారు . మత్తు పదార్థాలకు అలవాటు పడొద్దని  చెప్పారు. డ్రగ్స్​ సరఫరాపై ప్రత్యేక నిఘా ఉంచి వారి పై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు . ఈ కార్యక్రమంలో సీఐ రామలింగారెడ్డి , ఎస్సైలు హరికృష్ణ , వెంకటరెడ్డి , బాలకృష్ణ, పరమేశ్, లింగయ్య పాల్గొన్నారు.