మా మధ్య ప్రేమా.. గీమా ఏమీలేదు.. క్లారిటీ ఇచ్చిన నటుడు అభినవ్

మా మధ్య ప్రేమా.. గీమా ఏమీలేదు.. క్లారిటీ ఇచ్చిన నటుడు అభినవ్

టాలీవుడ్​ నటి కల్పికా గణేష్​(Kalpika ganesh) ఇటీవల వరుస వివాదాల్లో నిలుస్తోంది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి సినిమాలతో కల్పిక మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటుడు అభినవ్​ గోమటం(Abhinav Gomatam)పై ఆమె కాంట్రవర్శియల్​ కామెంట్స్​ చేసింది. తాజాగా అభినవ్​ వీరిద్దరి మధ్య గొడవపై క్లారిటీ ఇచ్చాడు. ‘తనకు నారీ శక్తి అవార్డు వచ్చిందని కల్పిక నాతో చెప్పింది.

ఈ అవార్డు గురించి నేనెప్పుడూ వినలేదు. నీకు రావడం సంతోషం అని మెసేజ్​కి రిప్లై​ ఇచ్చాను. కానీ, నా మాటలు తను తప్పుగా అర్థం చేసుకుంది. నన్ను పురుషాహంకారిగా ప్రచారం చేసింది’ అని తెలిపాడు. ఇక తామిద్దరం స్నేహితులమని ఇద్దరి మధ్య ప్రేమా గీమా లాంటివేమీ లేవని స్పష్టం చేశాడు. ఆ గొడవ దగ్గరి నుంచి ఇద్దరం టచ్​లో ఉండటం లేదని అభినవ్​ వివరించాడు. 

ALSO READ :- కేసీఆర్ను గద్దె దించడమే లక్ష్యం : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి