పుష్పతో రాబోతున్న అల్లు అర్జున్

పుష్పతో రాబోతున్న అల్లు అర్జున్

గంగోత్రి సినిమాతో చిత్రపరిశ్రమకు పరిచయమైన హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ రోజు ఆయన పుట్టిన రోజు. ఆ సందర్భంగా తన కొత్త సినిమా ఫస్ట్ లుక్‌ను బన్నీ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా విడుదల చేశారు. సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందినున్నారు.

ఈ సినిమాలో బన్నీ సరసన రష్మికా మందన్న హీరోయిన్‌గా నటించనున్నారు. మైత్రీమూవీ మేకర్స్‌ ద్వారా నవీన్ యెర్నేనీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మధ్యే అలవైకుంఠపురంలో సినిమాతో మంచి విజయాన్ని దక్కించుకున్న బన్నీ ఈ సినిమాతో ఎలా మెప్పిస్తాడో చూడాలి. విజయ్ సేతుపతి, జగపతిబాబు, వెన్నెల కిషోర్, అనసూయ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమా తెలుగు, హిందీ, కన్నడ, మళయాళం, తమిళ భాషలలో ఒకేసారి విడుదలకాబోతుంది.

For More News..

మర్కజ్ వెళ్లొచ్చిన తండ్రి నుంచి కూతురుకి సోకిన కరోనా

లాక్‌డౌన్ పోకముందే ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం

రూ. 1000 కే కరోనా క్లీనింగ్​ మెషిన్

ఫేక్​ న్యూస్​ వైరల్ ​చేస్తే కేసు బుక్కే!