ఆ హీరో క్షేమంగా ఇంటికొచ్చాడు.. ఫ్యాన్స్ హ్యాపీ

ఆ హీరో క్షేమంగా ఇంటికొచ్చాడు.. ఫ్యాన్స్ హ్యాపీ

అత్యంత విషమంగా ఆరోగ్యం.. ఫ్యాన్స్ ప్రార్థనలు చేయండి.. ఆయన ఆరోగ్యం ఏమీ బాగోలేదు అంటూ వచ్చిన.. అన్ని వార్తలకు చెక్ పెడుతూ.. చాలా క్షేమంగా.. ఆరోగ్యంగా.. సురక్షితంగా ఇంటికి వచ్చారు తమిళ వెటరన్ సూపర్ స్టార్ విజయ్ కాంత్.. సంపూర్ణ ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు మియోట్ ఇంటర్నేషనల్ ఆస్పత్రి.. డిసెంబర్ 11వ తేదీ ఉదయం హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసింది.

విజయ్ కాంత్ తమిళనాట సీనియర్ హీరో.. రాజకీయ పార్టీ అధ్యక్షుడు కూడానూ.. మూడేళ్లుగా విజయ్ కాంత్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. తరచూ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఏడాది క్రితం సింగపూర్ వెళ్లి చికిత్స చేయించుకుని వచ్చారు. ఆరోగ్యం సహకరించకపోవటంతో.. రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. సినీ ఫంక్షన్స్ లోనూ కనిపించటం లేదు. ఇంట్లోనే ఉంటున్నారు విజయ్ కాంత్.

నెల రోజుల క్రితం.. తీవ్ర అనారోగ్యం బారిన పడిన విజయ్ కాంత్ ను.. కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. మధ్యలో చనిపోయినట్లు వార్తలు వచ్చాయి.. వీటిని తీవ్రంగా ఖండించారు కుటుంబ సభ్యులు. డిసెంబర్ 11వ తేదీ సోమవారం.. ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని.. ఆరోగ్యంగా ఉన్నారని.. మాట్లాడుతున్నారని.. నడుస్తున్నారని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. దీంతో విజయ్ కాంత్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.