Dheeraj Kumar: చికిత్స పొందుతూ ప్రముఖ నటుడు, నిర్మాత కన్నుమూత

Dheeraj Kumar: చికిత్స పొందుతూ ప్రముఖ నటుడు, నిర్మాత కన్నుమూత

బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు మరియు టెలివిజన్ నిర్మాత ధీరజ్ కుమార్ (79) కన్నుమూశారు. కొంతకాలంగా న్యుమోనియాతో బాధపడుతున్న ఆయన ముంబై ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 

గత వారం నుంచి ధీరజ్ తీవ్రమైన శ్వాస సమస్యల కారణంగా ఆసుపత్రిలో చేరారు. ICUలో వెంటిలేటర్ సహాయంతో వైద్యులు అతనికి ట్రీట్మెంట్ చేస్తూ వస్తున్నారు. ధీరజ్ పరిస్థితి మరింత విషమించడంతో నేడు (జూలై 15న) మరణించారు. బుధవారం (జూలై 16న) ధీరజ్ కుమార్ అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. ఆయన మృతిపట్ల అభిమానులు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ : Ram Charan : అంచనాలను దాటేసిన 'పెద్ది' బడ్జెట్.. హైదరాబాద్ శివార్లలతో భారీ సెట్టింగ్ !

ధీరజ్ కుమార్ 1965లో టెలివిజన్లో తన కెరీర్ను స్టార్ట్ చేశారు. ఆ తర్వాత సినిమాల్లో అవకాశం రావడంతో నటుడిగా సాగుతూనే టెలివిజన్ రంగంలో కూడా రాణించారు. 1970-1984 మధ్యకాలంలో దాదాపు 20కి పైగా పంజాబీ చిత్రాలలో నటించాడు. 'స్వామి', 'హీరా పన్నా' మరియు 'రాతోన్ కా రాజా' వంటి అనేక ప్రముఖ హిందీ చిత్రాలలో కూడా నటించాడు.