
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) కథానాయకుడిగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం 'పెద్ది' ( Peddi ) . ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా ( Buchi Babu Sana ) దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రూరల్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని 2026 మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా థియేటర్లలోకి తీసుకువచ్చేందుకు మూవీ మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.
జనవరి10, 2025న సంక్రాంతి సందర్భంగా విడుదలైన ' గేమ్ చేంజర్' బాక్సాఫీస్ వద్ద బొల్తా పడింది. కనీసం ఊహించిన స్థాయిలో కూడా వసూళ్లను రాబట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో 'పెద్ది' సినిమాపై రామ్ చరణ్ గట్టిగానే ఫోకస్ పెట్టారు. భావోద్వేగం, ఐక్యత, గర్వం , క్రీడాస్పూర్తిని కలగలిపిన పవర్ ఫుల్ మూవీగా 'పెద్ది'ని తెరక్కిస్తున్నారు. తన కమ్యూనిటీకి బలమైన పల్లెటూరి కుర్రాడిగా లైవ్లీ అవతారంలో రామ్ చరణ్ ఈ మూవీలో కనిపించనున్నారు.
ALSO READ : Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’కు U/A సర్టిఫికెట్.. సెన్సార్ రివ్యూ ఎలా ఉందంటే?
భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న తెలుగు చిత్రాల్లో ఒకటిగా పెద్ది ఉండబోతుందని మూవీ మేకర్స్ ప్రకటించారు. బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీపడకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న తెలిపారు. 1980 నాటి విజయనగరం పట్టణాన్ని తలపించేలా విశాలమైన సెట్‌ను హైదరాబాద్ శివార్లలో నిర్మిస్తున్నారు . గ్రామంలో గృహాలు, వీధులు, రైల్వే స్టేషన్, క్రీడా మైదానం వంటి సెట్స్‌ను సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ప్రఖ్యాత ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా, దర్శక నిర్మాతలు సర్వశక్తులా ఒడ్డుతున్నారు.
భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న తెలుగు చిత్రాల్లో ఒకటిగా 'పెద్ది' ఉంది. ఇప్పటికే రూ. 250 కోట్లు దాటిన మూవీగా టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తుంది. ఈ 1980 నాటి భారీ సెట్టింగ్‌ను రీక్రియేట్ చేస్తుండటంతో అది కాస్త సుమారు రూ. 300 కోట్లకు చేరే అవకాశం ఉందని సినీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. విరిధి సినిమాస్ , మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రామ్ చరణ సరసన జాన్వీకపూర్ ( Janhvi Kapoor ) నటిస్తుంది. జగపతిబాబు ( Jagapathi Babu ) , దివ్వేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం ఎ. ఆర్. రెహమాన్ అందిస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ( Shiva Rajkumar ) ఈ మూవీలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఆయన పాత్ర పేరు, లుక్ ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. దీంతో ఈ సినిమా ఉన్న అంచనాలు పతాకస్థాయికి చేర్చింది.