సినీ నటుడు చంద్రమోహన్ కన్నుమూత

సినీ నటుడు చంద్రమోహన్ కన్నుమూత

ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్ కన్నుమూశారు. కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఏడాది క్రితం గుండె ఆపరేషన్ చేయించుకున్నారు. అప్పటి నుంచి ఇంటి దగ్గరే ఉంటున్నారు. ఈ క్రమంలోనే మరింత అనారోగ్యానికి గురైన చంద్రమోహన్ ను.. కుటుంబ సభ్యులు.. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. 2023, నవంబర్ 11వ తేదీ ఉదయం ఆయన తుది శ్వాస విడిచినట్లు తెలిపారు కుటుంబ సభ్యులు.

చంద్రమోహన్ వయస్సు 82 ఏళ్లు. ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమవారం హైదరాబాద్ లో అంత్యక్రియలు జరుగుతాయి. చంద్రమోహన్ మొత్తం 932 సినిమాల్లో నటించారు. అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్. 175 సినిమాల్లో హీరోగా నటించారాయన.

చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత తన పేరును చంద్రమోహన్ గా మార్చుకున్నారు.  తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన నటుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా లోని పమిడిముక్కలలో 1943లో జన్మించారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో బి.యస్.సి. పూర్తిచేసి.. కొంతకాలం ఏలూరులో పనిచేశారు. సినిమాల్లో నటించాలనే ఉత్సాహంతో మద్రాసు వెళ్లారు. 

హీరోగా రంగులరాట్నం (1966) తొలి చిత్రం. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. హీరోగా, సహ నాయకుడిగా.. హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. నాన్న పాత్రలు, కామెడీ పాత్రల ద్వారా చంద్రమోహన్ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుం.

Also read :- చంద్రమోహన్ కు రెండు సార్లు హీరో ఛాన్స్ మిస్.. ఆ తర్వాత వెతుక్కుంటూ వచ్చింది