చంద్రమోహన్ కు రెండు సార్లు హీరో ఛాన్స్ మిస్.. ఆ తర్వాత వెతుక్కుంటూ వచ్చింది

చంద్రమోహన్ కు రెండు సార్లు హీరో ఛాన్స్ మిస్.. ఆ తర్వాత వెతుక్కుంటూ వచ్చింది

మనం అనుకున్నది అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎలా అవుతుంది.. మనం అనుకున్నది వెంటనే అయిపోతే అందులో కిక్ ఏముంటుందీ.. సరిగ్గా ఇదే జరిగింది నటుడు చంద్రమోహన్ విషయంలో.. ఆయన సినిమాల్లో నటించాలనే బలమైన కోరికతో రెండు సార్లు ప్రయత్నించారు. రెండు సార్లు ఫెయిల్ అయ్యారు.. ఇక మనకు సినిమాలు సెట్ కావు.. సినిమాల అవకాశాలు రావు అనుకుని తన పని తాను చేసుకుంటున్న సమయంలో.. సినిమా ఛాన్స్ వెతుక్కుంటూ ఇంటికే వచ్చింది. చంద్రమోహన్ సినీ రంగం ప్రవేశం వెనక జరిగిన ఆసక్తికర విషయాలు చూద్దాం.. 

సినిమాల్లో నటించాలే కోరికతో.. ఫొటోలు దిగి.. అప్పట్లో మద్రాసులోని ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుకు పంపించారు. కుర్రోడు బాగున్నాడు అని.. మద్రాసు రమ్మని కబురు చేశారు ఆదుర్తి సుబ్బారావు. ఆనందంతో మద్రాస్ వెళ్లిన చంద్రబాబు.. అంతే ఉత్సాహంతో ఆడిషన్స్ ఇచ్చారు. అయితే ఆ సినిమాలో అవకాశం రాలేదు. ఆదుర్తి తీసిన ఆ సినిమాలో చంద్రమోహన్ స్థానంలో సూపర్ స్టార్ కృష్ణ సెలక్ట్ అయ్యారు. ఆ సినిమాలనే తేనె మనసులు.. 

రెండో సారి కూడా ఆదుర్తి సుబ్బారావు నుంచే కబురు వచ్చింది. ఆ సినిమాకూ మద్రాస్ వెళ్లి ఆడిషన్స్ ఇచ్చారు చంద్రమోహన్. ఈసారి ఛాన్స్ రావటం పక్కా అనుకున్నారు.. అదీ రాలేదు. రెండుసార్లు.. ఆదుర్తి సుబ్బారావు నుంచే అవకాశం రాకపోవటంతో.. ఇక లాభం లేదనుకుని బాపట్లలో ఉద్యోగం చేసుకుంటూ ఉన్నారు. పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు.

ఈ సమయంలోనే ఆదుర్తి సుబ్బారావు దగ్గర చంద్రమోహన్ ఫొటోలు చూసిన బి.ఎన్.రెడ్డి.. చంద్రమోహన్ కు కబురు చేశాడు. అయితే అప్పటికే రెండు సార్లు మద్రాస్ వెళ్లి ఫెయిల్ అయిన చంద్రమోహన్.. నేను రాలేనండీ.. ఉద్యోగం చేసుకుంటున్నాను అంటూ తిరిగి సమాధానం ఇచ్చారు. దీంతో బీ.ఎన్.రెడ్డి.. ఓ సలహా ఇచ్చారు. నేనే విజయవాడ వస్తున్నాను.. అక్కడ కలవండి అన్నారు. అన్నట్లుగానే విజయవాడలోని ఓ హోటల్ లో బీ.ఎన్.రెడ్డిని కలిశారు. హోటల్ లోనే ఆడిషన్స్ ఇచ్చారు. చొక్కా విప్పి నటించమంటే.. సిగ్గుతో నటించాడు. 

ఆ తర్వాత నెల రోజులకు బి.ఎన్.రెడ్డి నుంచి కబురు వచ్చింది. మద్రాసు రండి అని.. సెలవులు లేవు అని చెప్పారు చంద్రమోహన్. హీరోగా అవకాశం అని స్పష్టం చేశారు.. దీంతో ఉద్యోగానికి నెల రోజులు మెడికల్ లీవ్ పెట్టి.. మద్రాసు వెళ్లారు చంద్రమోహన్.. 

ఆ సినిమానే రంగులరాట్నం.. వాణిశ్రీ హీరోయిన్.. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. రంగులరాట్నంలో సినిమాలో చొక్కా లేకుండానే నటించాడు చంద్రమోహన్.. అప్పట్లో జిమ్ బాడీ ఒక్క చంద్రమోహన్ కే ఉండేదంట.. అలా రంగులరాట్నం సినిమాలో హీరో అయిన చంద్రమోహన్.. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. అదే విధంగా ఈ సినిమాతోనే హీరోయిన్ గా నిలదొక్కుకుంది వాణిశ్రీ.. 

ఇదండీ చంద్రమోహన్ హీరో అవ్వటం వెనక జరిగిన కథ..

Also Read:- ఈ తరానికి నాన్న క్యారెక్టర్ అంటే చంద్రమోహన్