
లోకనాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) హీరోగా వస్తున్న మూవీ థగ్ లైఫ్(Thug life) మూవీ షూటింగ్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఎయిర్ పోర్ట్ లో యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో మలయాళ నటుడు జోజు జార్జ్(Joju George) కు ప్రమాదం జరిగింది. షూటింగ్ లో భాగంగా హెలికాఫ్టర్ జుంపింగ్ సీన్ చేస్తుండగా కిందపడిపోయారు నటుడు జోజు జార్జ్. ఈ ప్రమాదంలో ఆయన ఎడమకాలికి గాయమయ్యింది. వెంటనే ఆయన్ని హాస్పిటల్ కి తరలించగా.. డాక్టర్లు పరీక్షించారు. చిన్న గాయమే కావడంతో వారం రోజులు రెస్ట్ తీసుకొమ్మని చెప్పారని సమాచారం.
ఇక థగ్ లైఫ్ సినిమా విషయానికి వస్తే.. తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా వస్తున్న ఈ సినిమాలో నటుడు జోజు జార్జ్ తోసహా.. త్రిష, జయం రవి, దుల్కర్ సల్మాన్, గౌతమ్ కార్తీక్, ఐశ్వర్య లక్ష్మీ కీ రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.