జూనియర్ ఎన్టీఆర్‌కు కరోనా పాజిటివ్

V6 Velugu Posted on May 10, 2021

హైదరాబాద్: టాలీవుడ్ టాప్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని స్వయంగా తారక్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. తనకు కరోనా సోకిందని, ఆందోళన చెందొద్దని ఫ్యాన్స్‌‌ను కోరాడు. ‘నాకు కరోనా పాజిటివ్‌‌గా తేలింది. దయచేసి ఆందోళన చెందకండి. నేను చాలా బాగున్నా. నాతోపాటు నా కుటుంబీకులు ఐసోలేషన్‌‌లో ఉన్నారు. డాక్టర్ల సూచనల మేరకు అన్ని నియమాలను మేం పాటిస్తున్నాం. గత కొద్ది రోజులుగా నాతో సన్నిహితంగా ఉన్న వారందరూ టెస్టులు చేయించుకోవాలని కోరుతున్నా. జాగ్రత్తగా ఉండండి’ అని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం జక్కన్న తీస్తున్న ఆర్‌ఆర్ఆర్ సినిమా పనుల్లో తారక్ బిజీగా ఉన్నాడు. ఆయన నటించబోయే తర్వాతి చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించనున్నాడు. 

 

Tagged Corona Positive, Trivikram Srinivas, RRR, Home Quarantine, isolation, junior NTR

Latest Videos

Subscribe Now

More News