కమల్ హీరో.. విజయ్ సేతుపతి విలన్‌‌‌‌

కమల్ హీరో.. విజయ్ సేతుపతి విలన్‌‌‌‌

క్యారెక్టర్ కోసం ఏం చేసేందుకైనా వెనుకాడని కమల్ హాసన్, తన కొత్త చిత్రం ‘విక్రమ్‌‌‌‌’ కోసం బిగ్ బాస్‌‌‌‌ షో నుంచి కూడా తప్పుకున్నారు. ఆ షో డేట్స్‌‌‌‌కి, సినిమా డేట్స్‌‌‌‌కి మధ్య  క్లాష్ రావడమే ఇందుకు కారణం. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ఆయనే ప్రొడ్యూస్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి విలన్‌‌‌‌గా నటిస్తున్నాడు.  చెన్నైలో షూటింగ్ జరుగుతోంది. హీరో, విలన్‌‌‌‌లను క్లైమాక్స్‌‌‌‌లో ఎదురుపడేలా చేయడం లోకేష్ స్టైల్. ఇందులోనూ చివర్లో కమల్, సేతుపతి తలపడతారట. ఆ సీన్స్‌‌‌‌ను పదిహేను రోజుల పాటు తీశాడట లోకేష్. సినిమాకి అవి హైలైట్ అంటున్నారు. ఫహాద్ ఫాజిల్ క్యారెక్టర్ ఏంటనేది మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. ఓ రిటైర్డ్ పోలీస్‌‌‌‌ చేసే సీక్రెట్ అసైన్‌‌‌‌మెంట్‌‌‌‌ చుట్టూ తిరిగే కథ ఇది. కమల్ రెండు డిఫరెంట్ వయసుల్లో కనిపించబోతున్నారట. యంగ్‌‌‌‌ లుక్‌‌‌‌ కోసం డీ ఏజింగ్ టెక్నిక్‌‌‌‌ని వాడుతున్నారు. మార్చ్‌‌‌‌ నెలలో షూటింగ్ పూర్తి చేసి ఏప్రిల్ 28న రిలీజ్ చేయాలనేది ప్లాన్. ఆ తర్వాత ‘ఇండియన్ 2’పై ఫోకస్ పెట్టాలని చూస్తున్నారు కమల్. గతంలో కొంత షూట్ జరిగినప్పటికీ మరో వంద రోజుల వరకు షూటింగ్ పార్ట్ బ్యాలెన్స్ ఉంది. కోర్టు కేసుల వరకు వెళ్లిన ఈ మూవీపై శంకర్ అంతగా ఆసక్తి చూపించడం లేదు. పైగా ఆయన‌‌‌‌ ప్రస్తుతం రామ్ చరణ్‌‌‌‌ సినిమాతో బిజీగా కూడా ఉన్నారు. కమల్ కోసం ఆయన ఓకే అంటే కనుక  జూన్ తర్వాత ఈ మూవీ స్టార్టయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.