కంగనాకు కొత్త చిక్కులు.. పాస్‌పోర్ట్ రెన్యూవల్‌‌ నిరాకరణ 

కంగనాకు కొత్త చిక్కులు.. పాస్‌పోర్ట్ రెన్యూవల్‌‌ నిరాకరణ 

ముంబై: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌కు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఆమె పాస్‌పోర్ట్ రెన్యువల్ విషయంలో పోలీసుల నుంచి ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో కంగన ముంబై హైకోర్టును ఆశ్రయించింది. కానీ అక్కడా ఆమెకు చుక్కెదురైంది. ఈ కేసును బాంబే హైకోర్టు ఈనెల 25కు వాయిదా వేసింది. తాజాగా నటిస్తున్న ధాకడ్ షూట్ కోసం బుడాపెస్ట్‌కు ఈ హిమాచల్ ముద్దుగుమ్మ వెళ్లాల్సి ఉంది. అందులో భాగంగా తన పాస్‌పోర్ట్‌ను రెన్యూవల్ చేయాలని కంగన అధికారులను కోరింది. కానీ రీసెంట్‌గా బాంద్రా పోలీసు స్టేషన్‌లో కంగనపై దేశ ద్రోహం కేసు నమోదు కావడంతో రెన్యూవల్ చేయలేమని అధికారులు స్పష్టం చేశారు. దీంతో షూటింగ్‌ల కోసం విదేశాలకు వెళ్లాల్సిన కారణంగా పాస్‌పోర్ట్ పునరుద్థరణకు అనుమతి ఇవ్వాలని ఆమె ముంబై హైకోర్టును కోరింది. అయితే కంగన చేసిన దరఖాస్తు స్పష్టంగా లేదని ఆ కేసును కోర్టు వాయిదా వేసింది.