ఎన్టీఆర్ బాటలో మహేష్ బాబు

V6 Velugu Posted on Dec 01, 2021

ఏపీలో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలన్నీ అస్తవ్యస్తమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలుచోట్ల ఇళ్లు కూలిపోయాయి. వరదల్లో కొట్టుకుపోయి చాలామంది మరణించారు. అయితే వరదల వల్ల నష్టపోయిన వారికి ఆర్థికసాయంగా సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 25 లక్షలు అందిస్తున్నట్లు సూపర్ స్టార్ మహేష్ బాబు తెలిపారు. ఈ సంక్షోభ సమయంలో అందరూ ముందుకు వచ్చి ఏపీకి సహాయం చేయాలని ఆయన అభ్యర్థించారు.

కాగా.. మహేష్ కంటే ముందు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏపీ ప్రభుత్వానికి రూ. 25 లక్షలు అందిస్తున్నట్లు ప్రకటించారు.

 

Tagged andhrapradesh, floods, NTR, Rains, Mahesh babu, AP CMRF

Latest Videos

Subscribe Now

More News