
మోహన్ భగత్ లీడ్ రోల్‌లో అజయ్ నాగ్ వి తెరకెక్కించిన చిత్రం ‘ఆరంభం’. అభిషేక్ వీటీ నిర్మించారు. శుక్రవారం సినిమా రిలీజ్. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతిథులుగా హాజరైన శ్రీవిష్ణు, తిరువీర్, డైరెక్టర్స్ నవీన్ మేడారం, వెంకటేష్ మహా, హీరోయిన్ శివానీ నాగరం సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. మోహన్ భగత్ మాట్లాడుతూ ‘ఐదేళ్ల క్రితం ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమా చేసినప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నానో.. ఈ చిత్రంలో నటించినందుకు కూడా ఇప్పుడు అంతే సంతోషంగా ఉన్నా. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’ అని చెప్పాడు. ఇలాంటి కొత్త కాన్సెప్ట్‌కు మంచి ‘ఆరంభం’ దక్కాలని కోరుకుంటున్నాం’ అని దర్శక నిర్మాతలు అన్నారు. మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు.