లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో మోహన్ లాల్ వయనాడ్ సహాయక చర్యల పర్యవేక్షణ

లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో మోహన్ లాల్ వయనాడ్ సహాయక చర్యల పర్యవేక్షణ

వయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో సినీ నటుడు మోహన్ లాల్ పర్యటించారు. ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో  మోహన్ లాల్ వయనాడ్ లో సహాయక చర్యలను పర్యవేక్షించారు. 2009లో ఆయనకు టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ పదవిని ప్రదానం చేసిన విషయం తెలిసిందే.

మోహన్ లాల్ శనివారం మెప్పాడిలోని ఆర్మీ క్యాంపుకు చేరుకున్నారు. తర్వాత ఆయన ఆర్మీ యూనిఫాం ధరించి, ఇండియన్ ఆర్మీతో కలిసి కొండచరియలు విరిగిపడిన ప్రదేశానికి చేరుకున్నారు. జరిగిన నష్టాన్ని, రెస్క్యూ ఆపరేషన్ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.