Dokka Seethamma Biopic: ‘డొక్కా సీతమ్మ’ మూవీ గొప్ప విజయం సాధించాలి: మురళీ మోహన్

Dokka Seethamma Biopic: ‘డొక్కా సీతమ్మ’ మూవీ గొప్ప విజయం సాధించాలి: మురళీ మోహన్

మురళీ మోహన్, ఆమని ప్రధాన పాత్రల్లో టి.వి. రవి నారాయణ్ దర్శకత్వంలో వల్లూరి రాంబాబు, మట్టా శ్రీనివాస్ నిర్మించిన చిత్రం ‘ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’. మంగళవారం (JUNE24) మురళీ మోహన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్రకు సంబంధించిన పోస్టర్‌‌‌‌‌‌‌‌, వీడియో గ్లింప్స్‌‌‌‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మురళీ మోహన్ మాట్లాడుతూ ‘డొక్కా సీతమ్మ లాంటి గొప్ప మనిషి జీవితంపై వస్తున్న ఈ చిత్రంలో నటించడం సంతోషంగా ఉంది. కమర్షియల్‌‌‌‌ సినిమాల మధ్య ఓ మంచి కథతో సినిమా చేసేందుకు రాంబాబు, రవి నారాయణ ముందుకు వచ్చారు.

ఇలాంటి చిత్రాలు పెద్ద విజయాన్ని సాధించాలి’అని అన్నారు. ఈ సినిమా విషయంలో మురళీ మోహన్ ప్రోత్సాహం మర్చిపోలేమని దర్శకనిర్మాతలు తెలిపారు.  దర్శకులు రేలంగి నరసింహారావు, శివనాగు, నిర్మాతలు బెక్కెం వేణుగోపాల్, రామ సత్యనారాయణ, లయన్ సాయి వెంకట్ సినిమా సక్సెస్ సాధించాలని బెస్ట్ విషెస్ చెప్పారు.