నానా పటేకర్ చనిపోకముందు ఏం జరిగింది.? 45 నిమిషాల CPR కూడా ఫలితం ఇవ్వలేదా..?

నానా పటేకర్ చనిపోకముందు ఏం జరిగింది.? 45 నిమిషాల CPR కూడా ఫలితం ఇవ్వలేదా..?

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు నానా పటేకర్ తుదిశ్వాస విడిచారు. గురువారం ( అక్టోబర్ 8 ) గోవాలోని డోనా పౌలాలో ఆయన నివాసంలో మృతి చెందారు నానా పటేకర్. అయితే..76 ఏళ్ళ వయసులో కూడా ఫిట్ నెస్ పై ఎక్కువ శ్రద్ధ చూపించే నానా పటేకర్ గుండెపోటుతో మరణిస్తాడని ఎవరూ ఉహించలేరని అంటున్నారు అభిమానులు, నెటిజన్స్. ఇటీవల తన ఇన్స్టాలో షేర్ చేసిన వీడియోలో కూడా నానాపటేకర్ 15 ట్రైసెప్ డిప్స్ చేస్తూ కనిపించారని... ఇంతలోనే ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని ఉహించలేకపోయామని అంటున్నారు అభిమానులు. 

నానా పటేకర్ గుండెపోటుతో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గుర్తించిన సిబ్బంది అయనను సమీపంలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో 45 నిమిషాల పాటు CPR చేసి ఆయనను బతికించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం ఇవ్వలేదు. ఇవాళ ఉదయం 5:20 నిమిషాలకు ఆయన మృతి చెందినట్లు ప్రకటించారు డాక్టర్లు. ఆయన మృతి పట్ల అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నానా పటేకర్ మృతి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి తీరని లోటని అబిప్రాయపడుతున్నారు.

నానా పటేకర్ చనిపోక ముందు ఏం జరిగింది:

76 ఏళ్ళ వయసులో  కూడా జిమ్ చేస్తూ ఫిట్నెస్ మెయింటైన చేసిన నానా పటేకర్ గుండెపోటుతో మృతిచెందడం జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. కొద్దిరోజుల క్రితం కూడా జిమ్ లో వర్కౌట్ చేస్తూ యాక్టివ్ కనిపించిన ఇలా హఠాన్మరణం చెందడం బాధాకరమని అంటున్నారు. 

నానా పటేకర్ తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారని.. 45 నిమిషాల పాటు కంటిన్యూగా CPR చేసినప్పటికీ ఆయనను బతికించలేకపోయామని అన్నారు డాక్టర్లు. నానా పటేకర్ మృతిపై మెడికో లీగల్ కేసు నమోదు చేశామని తెలిపారు మణిపాల్ ఆసుపత్రి డాక్టర్లు.

నానా పటేకర్ 1978లో గమన్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. హిందీ, మరాఠి భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు నానా పటేకర్. అంగార్, క్రాంతివీర్, ఖామోషి, వంటి చాలా చిత్రాల్లో ఆయన నటనకు ప్రశంసలు దక్కాయి.