
ప్రముఖ వర్సటీలి యాక్టర్ నాజర్ (Nassar) ప్రధాన పాత్రలో నటించిన కోలీవుడ్ మూవీ 'ది అకాలి'(The Akali ). తలైవాసల్ విజయ్, జయకుమార్ జానకిరామన్, వినోద్ కిషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్..తమిళ్ ఆహా ఓటీటీలో జూలై 19 (శుక్రవారం నుంచి) స్ట్రీమింగ్ కాబోతోంది. త్వరలో తెలుగు స్ట్రీమింగ్ డేట్ను మేకర్స్ ప్రకటించనున్నారు.
మహమ్మద్ ఆసీఫ్ హమీద్ తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్కు ఊళ్ళో సహజ సిద్ధంగా జరిగే అంశాలను జోడించి శభాష్ అనిపించుకున్నాడు. కానీ, ఈ సినిమా రిలీజ్ కు ముందు సరైన ప్రమోషన్స్ లేకపోవడంతో చాలా తక్కువ మందికి రిచ్ అయ్యింది. ది అకాలిలో కథ కథనాలకు డైరెక్టర్ మహమ్మద్ స్క్రీన్ ప్లే అదిరిపోయింది.
హార్రర్ సినిమా అంటే ఎలా ఉండాలో ది అకాలి అలా ఉందంటూ సినిమా చూసిన ఆడియన్స్ పోస్టులు పెట్టారు. ఈ సినిమాలో కామెడీ, కమర్షియల్ అంశాల జోలికి డైరెక్టర్ పోకుండా..సీరియస్ డార్క్ హారర్ థ్రిల్లర్‌ను తీసాడు కాబట్టే ప్రముఖ IMDB లో 10కి 9.1 రేటింగ్‌ను దక్కించుకున్నది.ఇకపోతే నాజర్ చాలా రోజుల తర్వాత కీ రోల్ చేసిన మూవీ ది అకాలి. ఇందులో తనదైన డార్క్ షెడ్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
Iruttu-kum velichathukum nadakura yutham-la yaar jeipa?⚡#TheAkaali premiers from July 19 #ahatamil@PBSproductions @ukeshvaraan @Dir_MohamedAsif #swayamsiddhadas #thotatharrani @poornimaRamasw1 @ActorArjai @vinoth_kishan @actornasser #thalaivasalvijay #jayakumar #vinothini pic.twitter.com/cRl1NRoEkA
— aha Tamil (@ahatamil) July 17, 2024
కథేంటంటే:
'జానిస్ మర్డర్స్' అని పిలువబడే వరుస హత్యలను పరిశోధించే హంజా (జై కుమార్) అనే పోలీసు అధికారి విచారణ చుట్టూ సినిమా కథాంశం తిరుగుతుంది. జానిస్ అనే అమ్మాయి క్షుద్రవిద్యలు, అతీంద్రియ శక్తుల సహాయంతో వరుసగా హత్యలకు పాల్పడుతుంది. పోలీస్ ఆఫీసర్ ఒక్కో ఆధారాన్ని సేకరించే క్రమంలో అతడు తెలుసుకున్న షాకింగ్ నిజాలేమిటి? చాలా మంది వ్యక్తులు ఎందుకు చంపబడ్డారు? జానిస్ నిజంగా వారిని చంపిందా? ఒకవేళ ఆమె నేరస్థురాలు కాకపోతే, ఇంత ఘోరంగా ఎలా చంపబడుతున్నారు? ఈ వింత చీకటి మర్డర్స్ వెనుక అసలు ఎవరున్నారు? అన్నదే ఈ మూవీ ప్రధానమైన అంశం.