సింగరేణి కాలనీ చిన్నారి కుటుంబానికి పవన్ పరామర్శ

V6 Velugu Posted on Sep 15, 2021

హైదరాబాద్: సింగరేణి హత్యాచార బాధితురాలి కుటుంబాన్ని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పరామర్శించారు. చిన్నారి తల్లిదండ్రులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారి కుటుంబానికి అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వం వీలైనంత త్వరగా బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పవన్ డిమాండ్ చేశారు. అయితే పవన్ రాకతో సైదాబాద్ ప్రాంతమంతా జనసందోహంగా మారింది. దాంతో పవన్.. చిన్నారి ఇంటికి వెళ్లలేకపోయారు. ఈ నేపథ్యంలో చిన్నారి పేరెంట్స్ పవన్ కాన్వాయ్ దగ్గరకు చేరుకున్నారు. 

Tagged Hyderabad, janasena, singareni colony, rape and murder, Saidabad, Power star pawan kalyan

Latest Videos

Subscribe Now

More News