హీరోగా బాహుబలి ఫేమ్ ప్రభాకర్

హీరోగా బాహుబలి ఫేమ్ ప్రభాకర్

‘బాహుబలి’లో కాలకేయ పాత్రతో విలన్‌‌గా  పాపులర్ అయిన ప్రభాకర్ ఇప్పుడు హీరోగా నటిస్తున్నాడు. పాలిక్ దర్శకత్వంలో  రావుల రమేష్  నిర్మిస్తున్నారు.  నిన్న హైదరాబాద్‌‌లో ఈ చిత్రం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ ‘రిటైర్డ్ ఆర్మీ ఆఫీస‌‌ర్ జీవితంలో ఓ రాత్రి ఏం జ‌‌రిగింది అనేది ఈ సినిమా స్టోరీ. ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తున్నందుకు హ్యాపీగా ఉంది’ అని చెప్పాడు. ‘ఈ నెలాఖరులో షూటింగ్ మొదలుపెడతాం. ఇందులో ప్రభాకర్ డ్యూయెల్ షేడ్‌‌లో కనిపిస్తారు’ అన్నారు దర్శకుడు పాలిక్. చ‌‌ల‌‌ప‌‌తి రావు, సుధ‌‌, జీవా, షకలక శంకర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.