
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) హీరోగా వచ్చిన బ్రో (Bro) మూవీ ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam tej) కీ రోల్ లో కనిపించిన ఈ సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్రో మూవీలో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ (Thirty Years Industry) పృథ్వీరాజ్.. శ్యాంబాబు అనే రోల్ లో యాక్ట్ చేశారు. ఇందులో పృథ్వీ రాజ్ పబ్‌లో డ్యాన్స్ చేస్తున్నట్లుగా ఒకట్రెండు సీన్‌లు ఉంటాయి. దీంతో ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారం రేగినా విషయం తెలిసేందే.
లేటెస్ట్ గా ఇదే విషయంపై పృథ్వీ స్పందించారు... నాకు అసలు రాంబాబు ఎవరో తెలియదు..నేను ఇమిటేట్ చేయటానికి ఆయన ఆస్కార్ లెవెల్ యాక్టర్ ఏమి కాదని..జస్ట్ ఈ మూవీలో నాది బాధ్యత లేని, పనికిమాలిన వెధవ క్యారెక్టర్. అందులో భాగంగానే బారుల్లో తాగుతూ, అమ్మాయిలతో డ్యాన్స్ చేసే క్యారెక్టర్ అని.. డైరెక్టర్ చెప్పినట్లు చేసే . బాధ్యత నాదని..నాకు ఇలాంటి శ్యాంబాబు క్యారెక్టర్స్, అవకాశాలు ఇంకా ఇవ్వాలని.. బ్రో మూవీ సక్సెస్ మీట్ లో మాట్లాడారు.
అయితే ఈ మూవీలో పృథ్వీ డ్యాన్స్, డ్రస్ అచ్చుగుద్దినట్లుగా.. అంబటి డ్యాన్స్, డ్రస్‌లాగే ఉండటం వల్ల, ఆ డ్యాన్స్‌కు పవన్ వంకలు పెడుతూ.. ఆ డ్యాన్స్ ఏంటి..? ఆ నడకేంటి..? డైలాగ్స్ పేల్చుతారు. దీంతో థియేటర్లో ఆడియన్స్ కు ఫుల్ జోష్ వచ్చింది. అయితే పృథ్వి గతంలో వైసీపీలో ఉండి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.