నిర్ధోషి అని తేల్చాక కూడా ‌‌‌‌‌‌‌‌ఇంకా స్పైగానే చూస్తున్నారు

 నిర్ధోషి అని తేల్చాక కూడా ‌‌‌‌‌‌‌‌ఇంకా స్పైగానే చూస్తున్నారు

చేయని నేరానికి జైలు పాలై, నిర్దోషిగా బయటకు వచ్చి, తనకు జరిగిన అన్యాయంపై ఇప్పటికీ న్యాయపోరాటం చేస్తున్నారు ఇస్రో మాజీ సైంటిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబి నారాయణన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. ఆయన జీవితం అధారంగా మాధవన్ తీసిన చిత్రం ‘రాకెట్రీ’. నంబి పాత్రను కూడా తనే పోషించారు. జులై 1న ఆరు భాషల్లో సినిమా విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాధవన్ మాట్లాడుతూ ‘విక్రమ్ వేద సినిమా తర్వాత నంబి నారాయణన్ గురించి ఒకరు చెప్పారు. మాల్దీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహిళతో అఫైర్, రాకెట్రీ సీక్రెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని పాకిస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి అమ్మారని అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి టార్చర్ పెట్టడం, సీబీఐ విచారణ తర్వాత ఆయన ఇన్నోసెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని తేలడం లాంటివి వినగానే ‘పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాండ్’ స్టోరీలా అనిపించింది.  త్రివేండ్రం వెళ్లి నంబి నారాయణన్ గారిని కలిశాను. చాలా కోపం, ఆవేదనతో  కేసు డిటెయిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. ఇన్నోసెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని కోర్టు తేల్చాక కూడా గూగుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సహా ప్రపంచమంతా తనను ఓ స్పైగానే చూస్తోందని ఆవేదన చెందారు. ఆ తర్వాత ఏడు నెలలు స్క్రిప్ట్ రాసి, మళ్లీ వెళ్లి ఆయనకి చెబితే సంతోషపడ్డారు.

తన లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురించి మరికొన్ని చెప్పారు. ఆ అచీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్స్ వింటుంటే ఈయన జేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాండ్ కాదు.. ఫాదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్ జేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాండ్ అనిపించింది. సైంటిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎన్నో అద్భుతాలు చేసినా తాను రాసిన రెండు పుస్తకాల్లో వాటిని ప్రస్తావించలేదు. ఎందుకని అడిగితే ‘అందుకు నాకు ప్రభుత్వం జీతం ఇచ్చింది, నేను చేశానంతే’ అని సింపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చెప్పారు. బోర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండి పోరాడేవాళ్లే కాదు, ఇలా ఎలాంటి పేరూ ఆశించకుండా దేశం కోసం పనిచేసే వాళ్లూ గొప్ప దేశభక్తులే. చరిత్రలోని రాజులు, ఫ్రీడమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైటర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైనే కాదు.. ఇలా సైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్న గొప్ప వ్యక్తులపై కూడా సినిమాలు రావాలి. అలాగని ఆయనలోని మంచిని మాత్రమే కాక బ్యాడ్ క్వాలిటీస్, అఫైర్స్, మైనస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కూడా అడిగాను. వేరే వాళ్లయితే గెటవుట్ అనేవాళ్లేమో (నవ్వుతూ). ఆయన పక్కన కూర్చొబెట్టుకుని అన్నీ చెప్పారు. ఏడాదిన్నర పాటు స్క్రిప్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పై వర్క్ చేశా.

 సినిమా పూర్తవడానికి ఆరేళ్లు పట్టింది. రాకెట్ ఇంజన్, స్పేస్ షిప్స్ లాంటివన్నీ రియలిస్టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చూపించా. 29 నుంచి 79 వయసు వరకూ  ఓ సైంటిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎలా ఉంటారో అలా కనిపించడానికి ట్రై చేశా. ప్రాస్థటిక్ మేకప్ లాంటివి వాడలేదు. నా పళ్ల వరుసను కూడా మార్చుకున్నాను. తక్కువ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బరువు పెరిగి తగ్గాను. మనం నమ్మలేని నిజాలెన్నో ఆయన లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. కొత్తగా మసాలాలు అద్దాల్సిన పనిలేదు. జరిగిన వాటినే ప్రేక్షకులకు నమ్మకం కలిగించేలా తీస్తే చాలు. ఎందుకంటే ఒక మనిషి ఇన్ని చేశాడంటే నమ్మలేం. అందుకే ఈ సినిమాలో ఫిక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంటే ఫ్యాక్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్కువ.’’