
హైదరాబాద్: సినీ నటుడు ధర్మ మహేష్‌పై గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ ధర్మ మహేష్ భార్య చిరుమామిళ్ల గౌతమి గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసింది. భర్తతో పాటు అతడి కుటుంబ సభ్యులపైన ఫిర్యాదు చేసింది గౌతమి. సినిమా అవకాశాలు పెరగడంతో తర్వాత జల్సాలకు అలవాటు పడి అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు నటుడు ధర్మ మహేష్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులపై గచ్చిబౌలి మహిళ పీఎస్ పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. కాగా, ధర్మ మహేష్, గౌతమికి 2019లో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. ఇంతకు ముందు కూడా వరకట్నం వేధింపుల ఆరోపణలపై పోలీసులు మహేశ్‌కు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు సమాచారం.
అయినప్పటికీ ఏ మాత్రం మారని మహేష్ అలాగే వేధింపులు కొనసాగిస్తున్నాడని అతడి భార్య ఆరోపించారు. నటుడు ధర్మ మహేష్ సింధూరం, డ్రింకర్ సాయి సినిమాల్లో హీరోగా నటించి గుర్తింపు పొందాడు. ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకుంటున్న సమయంలో వరకట్న వేధింపుల వ్యవహరంతో బజారున పడటంతో అతడి టోటల్ సినీ కెరీరే ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంది.