ఏ సమస్య ఉన్నా నా దగ్గరికి రండి : ఫిలిం ఫెడరేషన్ సభ్యులతో చిరంజీవి

ఏ సమస్య ఉన్నా నా దగ్గరికి రండి : ఫిలిం ఫెడరేషన్ సభ్యులతో చిరంజీవి

వేతనాలు పెంపు కోసం గత 15 రోజులుగా సినీ కార్మికులు స్ట్రైక్ చేస్తున్నారు. కానీ నిర్మాతలు, ఫెడరేషన్ మధ్య చర్చలు సఫలం కావడం లేదు. ఈ అంశంపై సోమవారం (ఆగస్టు 18) ఫిలిం ఫెడరేషన్ సభ్యులు చిరంజీవితో భేటీ అయ్యారు. తమ సమస్యలను చిరంజీవికి చెప్పుకున్నారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన భేటీలో కార్మిక సంఘాల సమస్యలను విన్నారు చిరంజీవి.

ఫెడరేషన్ కు ఏ సమస్యలు ఉన్నా తన వద్దకు రావాలని చిరంజీవి చెప్పినట్లు ఫెడరేషన్ సభ్యులు తెలిపారు. మళ్లీ మంగళవారం కూడా మరోసారి భేట కానున్నారు. దీనికి తోడు ఫెడరేషన్ సభ్యులు జనరల్ మీటింగ్ ఏర్పాటు చేసుకోనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ఫిలింఛాంబర్, ఫిలిం ఫెడరేషన్ సభ్యులను కలిపి చిరంజీవి మీటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 

24  యూనియన్ల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తాం అంటే పెట్టుకోండని చిరు ఓకే చెప్పినట్లు తెలిపారు. ఫెడరేషన్ నిర్ణయాలు, చర్చలు, డిమాండ్లు కార్మికుల అందరికీ తెలియాల్సిన అవసరం ఉన్నందున మీటింగ్ పెట్టుకొమ్మని సూచించినట్లు చెప్పారు.  మరోవైపు ఛాంబర్ నుంచి కూడా పిలుపు వచ్చిందని అన్నారు. 

కోసం కొట్లాడుతున్నాం.. మాకు 30 శాతం వేతనాలు పెంచుతారని ఆశిస్తున్నాం.. కార్మికుల సమస్యలను నిర్మాతలు అర్థం చేసుకోవాలి.. అని అన్నారు ఫెడరేషన్ సభ్యులు. తమ సమస్యలను ప్రశాంతంగా విన్న చిరు.. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారని అన్నారు. మరో రెండు రోజుల్లో చిరంజీవి ఈ సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తున్నామని అన్నారు.