పొలిటికల్​ ఎంట్రీపై రజనీ ఫైనల్ డిసీషన్!

పొలిటికల్​ ఎంట్రీపై రజనీ ఫైనల్ డిసీషన్!

పొలిటికల్​ ఎంట్రీపై రజనీ ఏంచెప్తరో!

ఫ్యాన్స్​తో నేడు సూపర్​ స్టార్ భేటీ

ఆ తర్వాతే ఎన్నికల్లో పోటీపై

ఫైనల్​ డెసిషన్​ తీసుకుంటరు

చెన్నై: తమిళ సూపర్​ స్టార్​ రజనీకాంత్​ రాజకీయాల్లోకి వస్తున్నారా.. లేదా.. అనే దానిపై ఇప్పటి వరకున్న సస్పెన్స్​కు తెరపడనుంది. దీనిపై ఫ్యాన్స్​తో చర్చించి, సోమవారం రజనీ ఫైనల్​ నిర్ణయం తీసుకుంటారని సమాచారం. కోడంబాక్కంలోని రజనీ ఫంక్షన్​ హాల్​ ఈ భేటీకి వేదిక కానుంది. ఫ్యాన్స్​ గ్రూపులకు చెందిన జిల్లా నేతలు పాల్గొనే ఈ మీటింగ్​కు రజనీ ప్రత్యక్షంగా కాకుండా వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా హాజరవుతారని తెలుస్తోంది. రజనీకాంత్​ రాజకీయ ప్రవేశంపై గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. 2017 డిసెంబర్​ 31న రాజకీయాల్లో అడుగుపెడతానంటూ స్వయంగా రజనీకాంత్​ ప్రకటించారు. తర్వాత రజనీ మక్కల్​ మంద్రమ్(ఆర్ఎంఎం) పేరుతో పార్టీ ప్రకటన కూడా చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే పోటీ చేస్తామని రజనీ వెల్లడించారు. ముందస్తుగానే బూత్​ కమిటీలను ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించారు. ఆ తర్వాత రాజకీయంగా ఎలాంటి చర్యలు చేపట్టలే. సరైన టైమ్​లో రాజకీయాల్లోకి వస్తానంటూ రజనీ తరచుగా ప్రకటనలు చేశారు. దీంతో రజనీ ఫ్యాన్స్​తో పాటు తమిళ ప్రజల్లోనూ కన్ఫ్యూజన్​ నెలకొంది. దీనిపై సోమవారం క్లారిటీ వస్తుందని రజనీ ఫ్యాన్స్​ చెబుతున్నారు.

For More News..

గ్రేటర్ బరిలో సీనియర్లు వర్సెస్​ జూనియర్లు

ఇంటర్నల్ క్యాంపెయిన్​ షురూ.. వాట్సాప్​ మెసేజ్, ఫేస్​బుక్​‌లే కీలకం

గ్రేటర్ బెట్: ఏ పార్టీకి ఎన్ని సీట్లోస్తయ్.. రూ. 2 వేల నుంచి రూ. 10 లక్షల దాకా బెట్టింగ్