ఒత్తిడి చేయోద్దు.. రాజకీయాల్లోకి రాలేను

ఒత్తిడి చేయోద్దు.. రాజకీయాల్లోకి రాలేను

సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు నిరసనలు చేస్తున్నారు. దాంతో తాను రాజకీయాల్లోకి రాలేనని మరోసారి స్పష్టం చేశారు. తన ఆరోగ్య పరిస్థితుల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నాని ఆయన అభిమానులకు తెలిపారు. తాను రాజకీయాల్లోకి రావాలంటూ అభిమానులు నిరసనలు చేయడం కరెక్ట్ కాదని ఆయన అన్నారు. రాజకీయాల్లోకి రావాలని తనపై ఒత్తిడి తీసుకురావద్దని ఆయన తన అభిమానులను కోరారు. తన అభిమానులు ర్యాలీలు, ధర్నాలు ఆపేయాలని ఆయన సూచించారు. రాజకీయ ఎంట్రీపై మనసు మార్చుకునే అవకాశంలేదని ఆయన తేల్చి చెప్పారు.

దీనికి సంబంధించి రజినీకాంత్ ఓ ట్వీట్ చేశారు. ‘రాజకీయాల్లోకి రావొద్దనే నా నిర్ణయానికి వ్యతిరేకంగా నా అభిమానులు కొందరు చెన్నైలో ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ఆ నిరసనను నేను అభినందిస్తున్నాను. కానీ, ఈ నిరసనకు రజనీ మక్కల్ మండ్రం అనుమతి లేదు. ఈ నిరసనలలో పాల్గొననివారికి నా ధన్యవాదాలు. నేను రాజకీయాల్లోకి ఎందుకు రావడంలేదో గతంలోనే తెలిపాను. రాజకీయాల్లోకి రావాలని నన్ను బలవంతంచేసి బాధపెట్టొద్దు. ఇటువంటి నిరసనలలో నా అభిమానులెవరూ ఇటువంటి నిరసనలలో పాల్గొనకూడదని ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నాను’ అని ఆయన ట్వీట్ చేశారు.

For More News..

అఖిలప్రియకు నో బెయిల్.. మూడు రోజుల పోలీస్ కస్టడీ

16 వేల కిలోమీటర్లు.. 17 గంటలు.. 30 వేల ఫీట్ల ఎత్తు.. ఎయిర్ ఇండియా మహిళా పైలట్ల రికార్డు

నిమ్స్ హాస్పిటల్ వెనుక ఉరేసుకొని వ్యక్తి సూసైడ్