అభిమానులకు రాంచరణ్ బహిరంగ లేఖ

అభిమానులకు రాంచరణ్ బహిరంగ లేఖ

కరోనా గురించి బాధ్యతగా సినీ హీరోలు తమ వంతు ప్రచారం చేస్తున్నారు. రీసెంట్‌గా జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ ఇద్దరూ కలిసి కరోనా గురించి ఒక వీడియో రీలీజ్ చేశారు. మార్చి 27న మెగా పవర్ స్టార్ హీరో రాంచరణ్ పుట్టిన రోజు. రాంచరణ్ బర్త్‌డే సందర్భంగా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున వేడుకలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ.. వాటన్నింటికి ఫుల్ స్టాప్ పెడుతూ.. తన బర్త్‌డే వేడుకలు చేయోద్దని అభిమానులను కోరుతూ రాంచరణ్ ఒక లేఖను విడుదల చేశారు. కరోనా వ్యాప్తి చెందుతుండటంతో.. తన అభిమానులంతా ప్రజలలో కరోనా గురించి అవగాహన కల్పించాలని ఆయన కోరారు. అదే తనకిచ్చే పెద్ద గిఫ్ట్ అని ఆయన అన్నారు. రాంచరణ్ తన లేఖలో కింది విధంగా పేర్కొన్నారు.

‘మీకు నా మీద ఉన్న ప్రేమ మరియు నా పుట్టిన రోజుని పండుగగా జరపడానికి మీర పడుతున్న కష్టాన్ని నేను అర్థం చేసుకోగలను. మనం ఉన్న ఈ అసాధారణ పరిస్థితులు మీకు తెలియనివి కావు. ఇలాంటి సందర్భంలో మనం సాధ్యమైనంత వరకు జన సాంద్రత తక్కువగా ఉండేట్లు చూసుకుంటూ ఉండటం మంచిది. ఇది మనసులో పెట్టుకొని ఈ సంవత్సరం నా పుట్టిన రోజు వేడుకలను విరమించుకోవాల్సిందిగా నా మనవి.

మీరంతా మన అధికారులకు సహకరించి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే విధానాలు ప్రజలకి అర్థమయ్యే విధంగా తెలియజేసి మీ వంతు సామాజిక బాధ్యతని నెరవేర్చితే అదే నాకు ఈ సంవత్సరం మీరు ఇచేచ అతిపెద్ద పుట్టిన రోజు కానుక.

నా ఈ మనవిని మీరంతా సహృదయంతో స్వీకరించి పాటిస్తారు అని ఆశిస్తున్నాను.’

For More News..

నేటి నుంచి కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లు బంద్

నిజామాబాద్ ఎమ్మెల్సీ బరిలోకి కవిత