యంగ్ టీమ్ తీసిన చిదంబరం హిట్ అవ్వాలి : ఎం.ఎం.కీరవాణి

యంగ్ టీమ్ తీసిన చిదంబరం హిట్ అవ్వాలి : ఎం.ఎం.కీరవాణి

వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా వినయ్ రత్నం దర్శకత్వంలో వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణారెడ్డి నిర్మించిన చిత్రం ‘శ్రీ చిదంబరం గారు’.  శుక్రవారం సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎం.ఎం.కీరవాణి మాట్లాడుతూ ‘సింగర్‌‌‌‌‌‌‌‌ అవ్వాలని వచ్చిన నేను అది కష్టమని తెలుసుకుని సంగీత దర్శకుడిని అయ్యాను. 

అది నా బ్రెడ్‌‌‌‌ అండ్ బటర్‌‌‌‌‌‌‌‌ అవగా సింగింగ్‌‌‌‌ హాబీగా మారిపోయింది.  ఈ సినిమాలో నేను పాడిన పాటను నా చెల్లెలు ప్రతిరోజు సుప్రభాతంలా వింటోంది. అలాంటి పాట పాడటం సంతోషంగా ఉంది.  యంగ్ బ్లడ్ ఎంతో ఉత్సాహంగా చేసిన ఈ సినిమా సక్సెస్‌‌‌‌ సాధించాలని కోరుకుంటున్నా’ అన్నారు. మరో అతిథి ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ ‘ట్రైలర్‌‌‌‌‌‌‌‌ ఎంతో నేచురల్‌‌‌‌గా ఉంది.  ఇలాంటి లీడ్ క్యారెక్టర్స్‌‌‌‌తో సినిమా చేయడం అరుదు. ప్రేక్షకులు ఈ తరహా చిత్రాలను ఆదరించాలి’ అని కోరాడు. మొదటి సినిమా ఫీలింగ్‌‌‌‌ టీమ్ అందరికీ జీవితాంతం గుర్తుండేలా పెద్ద విజయం సాధించాలని నిహారిక కొణిదెల విష్ చేశారు. ఇన్‌‌‌‌సెక్యూరిటీని దాటి మన జీవితంలో ఎలా ఎదగాలి అనే సందేశాన్ని కమర్షియల్‌‌‌‌ ఎలిమెంట్స్‌‌‌‌తో చెప్పిన సినిమా ఇదని డిస్ట్రిబ్యూటర్​ వంశీ నందిపాటి అన్నారు.  ఒకరినొకళ్లు అర్థం చేసుకునే ప్రేమకథ ఇదని హీరో వంశీ తుమ్మల అన్నాడు.  అందరి హృదయాలను హత్తుకునే సినిమా అవుతుందని దర్శకుడు, నిర్మాతలు తెలియజేశారు.