చరణ్ రూటు మారుస్తాడా?

V6 Velugu Posted on Aug 06, 2021

‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ సినిమాతో ఇన్నాళ్లూ లాక్ అయిన రామ్ చరణ్, ఇప్పుడు  కొత్త సినిమాల లైనప్‌‌పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. వరుస విజయాలతో మెప్పిస్తున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడనే వార్త బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే స్టోరీ లైన్ విన్నాడట కూడా. కొన్నాళ్లుగా చరణ్‌‌తో సినిమా తీసే ప్రయత్నాల్లో ఉన్న యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనుందట. ఇదో రొమాంటిక్ సబ్జెక్ట్ అని తెలుస్తోంది. అనిల్ సినిమాల్లో ఎంటర్‌‌‌‌టైన్మెంట్ ఏ స్థాయిలో ఉంటుందో తెలిసిందే. అంటే కాస్త రూటు మార్చి.. వరుస సీరియస్ రోల్స్ తర్వాత ఓ మంచి 
ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌లో నటించాలని చరణ్ అనుకుంటున్నట్లు అర్థమవుతోంది. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తి కావస్తోంది కనుక అతి త్వరలో ఆ ప్రాజెక్ట్ నుండి  ఫ్రీ అవుతాడు చరణ్. ఇక చిరంజీవితో కలిసి నటిస్తున్న ‘ఆచార్య’ రెండు పాటలు మినహా పూర్తయింది. ఈ నెలాఖరుతో వాటి షూట్ కూడా కంప్లీట్ కానుంది. ఆ వెంటనే శంకర్ సినిమా పట్టాలెక్కబోతోంది. హీరోయిన్‌‌గా కియారాని ఫైనల్ చేశారు.సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుండి ఫస్ట్ షెడ్యూల్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. జక్కన్నలాగే శంకర్ కూడా తన సినిమాలకి ఎక్కువ టైమ్ తీసుకుంటాడు. కానీ ఈ సినిమాని మాత్రం ఐదు నెలల్లో కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. మరోవైపు వెంకటేష్, వరుణ్ తేజ్ లతో ‘ఎఫ్ 3’ తీస్తున్న అనిల్, అది పూర్తవగానే బాలకృష్ణ సినిమాని స్టార్ట్ చేయనున్నాడు. ఒకవేళ అతనితో సినిమా కనుక కన్‌‌ఫర్మ్ అయితే.. శంకర్ మూవీ తర్వాత రామ్ చరణ్‌‌ చేయబోయే సినిమా ఇదే కానుంది.

Tagged acharya, RRR, anil ravipudi, Hero Ramcharan, ramcharan new movie

Latest Videos

Subscribe Now

More News