సీనియర్ నటుడు సత్యరాజ్ కు కరోనా

సీనియర్ నటుడు సత్యరాజ్ కు కరోనా

బాహుబలి కట్టప్ప, సీనియర్ నటుడు సత్యరాజ్ కరోనా బారినపడ్డారు. ఇటీవల ఆయనకు కరోనా సోకడంతో.. వైద్యుల సూచన మేరకు హోం ఐసోలేషన్‎లో ఉంటున్నారు. కాగా.. గత రాత్రి ఆయన పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు వెంటనే చెన్నైలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. డాక్టర్లు సత్యరాజ్ ఆరోగ్యం గురించి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తే గానీ పూర్తి వివరాలు తెలియవు. 

కాగా.. ఈ మధ్యకాలంలో నటీనటులు చాలామంది క‌రోనా వైర‌స్ బారినపడుతున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ త్రిష కూడా కరోనా బారినపడి కోలుకుంటున్నట్లు ట్వీట్ చేసింది. హీరో మ‌హేష్ బాబు, మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్, హీరో విశ్వక్‌ సేన్‌, మంచు ల‌క్ష్మీ, మీనా, మంచు మనోజ్, కమెడియన్ వడివేలు, చియాన్ విక్రమ్, అర్జున్, కమల్ హాసన్, తదితరులు క‌రోనా బారినపడి కోలుకుంటున్నారు.