జాతకాలు కలవలేదు.. అందుకే మధుమితకు బ్రేకప్ చెప్పాను

జాతకాలు కలవలేదు.. అందుకే మధుమితకు బ్రేకప్ చెప్పాను

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న క్యూట్ కపుల్స్‏లో శివ బాలాజీ, మధుమిత జంట ఒకటి. వీళ్ళిద్దరిది ప్రేమ పెళ్లి. దాదాపు నాలుగేళ్లు ప్రేమలో మునిగితెలియన ఈ జంట.. 2009లో పెద్దల సమక్షంలో పెళ్లిచేసుకున్నారు. అయితే.. వీళ్ళ పెళ్లి చాలా విచిత్రంగా జరిగిందట. తాజాగా ఈ జంట ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా.. వీళ్ళ పెళ్లి గురించి ఇంట్రెస్టిగ్ విషయాలు చెప్పుకొచ్చారు.

"దాదాపు నాలుగేళ్లు ప్రేమలో ఉన్న ఈ జంట ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారట. ముందు వీళ్ళ పెళ్ళికి  ఇరు కుటుంబాలు కూడా ఒప్పుకున్నాయట. అన్ని సెట్ అయ్యాయని అనుకునే సమయానికి.. ఒకరోజు శివ బాలాజీ ఫోన్ చేసి మన జాతకాలు కలవడంలేదు, మనం పెళ్లి చేసుకుంటే మా అమ్మ చనిపోతుందట అని చెప్పాడట. ఆక్షణంలో ఎం చేయాలో తెలియని మధుమిత.. చాలా ఏడ్చిందట. అలా దాదాపు ఒక సంవత్సరంపాటు ఇద్దరు దూరంగానే ఉన్నారట. ఆతరువాత కొంతకాలానికి  శివబాలాజీ తన ఇంట్లో వాళ్ళని ఒప్పించి మధుమితను పెళ్లి చేసుకున్నారట.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్.. నిజమైన ప్రేమ అంటే అంతే.. ఎన్ని అడ్డంకులు వచ్చినా కచ్చితంగా గెలుస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.