కేసును కొట్టేయాలంటూ హైకోర్టులో పిటీషన్ : శివాజి

కేసును కొట్టేయాలంటూ హైకోర్టులో  పిటీషన్ : శివాజి

హైదరాబాద్: సినీ నటుడు శివాజీ హైకోర్టు లో క్వాష్ పిటీషన్ వేశారు. తనపై సైబర్ క్రైమ్ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని పిటీషన్ దాఖలు చేశారు. పోలీసులు తనను ముందస్తు అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలని పిటీషన్ లో కోరారు. ఇప్పటి వరకు శివాజీ కి మూడు సార్లు నోటిసులు జారీ చేసినా.. పోలీసుల విచారణకు హాజరుకాలేదని కోర్ట్ కు ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని అన్నారు. దీంతో ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 26 కు వాయిదా వేసిన హైకోర్టు తీర్పునిచ్చింది.