
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తమిళ సినీ నటుడు శింబు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శింబు తీవ్ర ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నాడు. 'వెందు తనిందదు కాడు' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న శింబుకు నిన్నటి (శుక్రవారం) నుంచి తీవ్ర జ్వరం, గొంతులో ఇన్ఫెక్షన్ తో బాధపడుతుండడంతో ఆస్పత్రిలో చేరాడు. అయితే .. ఇది మామూలు ఇన్ఫెక్షన్ మాత్రమేనని .. కరోనా కాదని డాక్టర్లు చెప్పారని సన్నిహితులు తెలిపారు.