Sivaji Laya: కోర్ట్ సక్సెస్తో హీరో, నిర్మాతగా శివాజీ.. హీరోయిన్ లయతో మరోసారి.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

Sivaji Laya: కోర్ట్ సక్సెస్తో హీరో, నిర్మాతగా శివాజీ.. హీరోయిన్ లయతో మరోసారి.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

90s వెబ్ సిరీస్, కోర్ట్ చిత్రంతో ఆకట్టుకున్న శివాజీ మరో డిఫరెంట్ కాన్సెప్ట్‌‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తను లీడ్‌‌ రోల్‌‌లో నటిస్తున్న ఈ చిత్రానికి సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. శివాజీనే నిర్మిస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా ఈ చిత్రం నుండి తన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఇందులో శివాజీ పంచాయతీ సెక్రటరీ శ్రీరామ్‌‌ పాత్రను పోషిస్తున్నట్టు రివీల్ చేశారు. నిజాయితీపరుడైన వ్యక్తి, తప్పుని సమర్ధించని మనస్తత్వం, అన్యాయాన్ని సహించలేని క్యారెక్టర్‌‌‌‌ ఆయనది అని టీమ్ ప్రకటించింది.

తన వల్ల మాత్రమే కాదు, ఏ ఒక్కరి వల్ల కూడా జనం ఇబ్బంది పడకూడదు అని ఆలోచించే మనిషి. భార్య బిడ్డలే ఇతని ప్రపంచం. వాళ్ళని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. వాళ్ళ దాకా వస్తే ప్రాణం ఇవ్వడానికైనా వెనుకాడని మనిషి’ అంటూ శివాజీ పాత్రను పరిచయం చేశారు మేకర్స్.

ఈ చిత్రంలో  శివాజీకి జంటగా లయ నటిస్తోంది. వీరి కాంబినేషన్‌‌లో గతంలో సక్సెస్‌‌ఫుల్ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు ద్వారా మరోసారి ఈటీవీ విన్‌‌తో కలిసి శివాజీ పనిచేస్తున్నారు. 90స్ వెబ్ సిరీస్‌‌లో శివాజీతో కలిసి నటించిన బాల నటుడు రోహన్, అలీ, ధనరాజ్ ఈ చిత్రంలోనూ కీలకపాత్రలు పోషిస్తున్నారు.