రాజకీయాల్లోకి సోనూ సూద్ సోదరి

రాజకీయాల్లోకి సోనూ సూద్ సోదరి

ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్... ప్రస్తుతం ఈ పేరును ప్రజలకు పరిచయం చేయాల్సిన పనిలేదు. దేశ వ్యాప్తంగా సోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. నటనలోనే కాకుండా.. నిజ జీవితంలో కూడా రియల్ హీరో అనిపించుకున్నాడు. కరోనా సమయంలో సోనూ సూద్ చేసిన సేవకు దేశవ్యాప్తంగా ప్రజలు ఆయనకు అభిమానులు అయిపోయారు. కరోనా రోగులతో పాటు..  ముఖ్యంగా వలస కూలీల విషయంలో సోను చేసిన సాయం మరువలేనిది. 

అయితే సోను సూద్ రాజకీయాల్లో వస్తారా ? అని కొంత కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది పంజాబ్ ఎన్నికలు రానున్నాయి. దీంతో ఈ హీరో అక్కడ ఎలక్షన్స్‌లో పోటీ చేస్తారా ? అని అనేక రకాలు ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అయితే ఈ క్రమంలో సోనూ సూద్ కీలక ప్రకటన చేశారు. ఆయన సోదరి పంజాబ్ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నట్లు స్వయంగా ప్రకటించారు. సోనూ సోదరి మాల్విక వచ్చే ఏడాది జరగనున్నపంజాబ్ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నట్లు తెలిపారు. అయితే ఏ పార్టీ నుంచి ఎన్నికల బరిలోకి దిగాలన్న విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. త్వరలోనే పార్టీ విషయంలో కూడా స్పష్టత ఇస్తామన్నారు.